రూ.2 లక్షలు విత్‌డ్రా చేసిన గంటలోపే వీళ్లిద్దరూ అతడి బ్యాగ్‌లోంచి డబ్బును ఎలా మాయం చేశారంటే..

ABN , First Publish Date - 2022-11-22T16:09:18+05:30 IST

ఆ వ్యక్తి తన ఖాతా నుంచి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసేందుకు సోమవారం ఉదయం బ్యాంకుకు వెళ్లాడు. 2 లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకున్నాడు. రూ.1.96 లక్షలను బ్యాగ్‌లో పెట్టి చిరిగిన రెండు 2000 నోట్లను మార్చుకునేందుకు కౌంటర్ వద్దకు వెళ్లాడు. వాటిని మార్చి తిరిగి వచ్చి చూసేసరికి..

రూ.2 లక్షలు విత్‌డ్రా చేసిన గంటలోపే వీళ్లిద్దరూ అతడి బ్యాగ్‌లోంచి డబ్బును ఎలా మాయం చేశారంటే..

ఆ వ్యక్తి తన ఖాతా నుంచి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసేందుకు సోమవారం ఉదయం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వెళ్లాడు. 2 లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకున్నాడు. మొత్తం డబ్బు లెక్కించుకోగా, రెండు వేల రూపాయల నోట్లు రెండు చిరిగినట్టు కనిపించాయి.. రూ.1.96 లక్షలను బ్యాగ్‌లో పెట్టి చిరిగిన రెండు 2000 నోట్లను మార్చుకునేందుకు కౌంటర్ వద్దకు వెళ్లాడు. వాటిని మార్చి తిరిగి వచ్చి చూసేసరికి బ్యాగ్‌లో ఉంచిన డబ్బు మాయం అయింది.. షాకైన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హర్యానాలోని నార్నాల్‌కు చెందిన హరిరామ్ తన ఖాతా నుంచి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసేందుకు సోమవారం ఉదయం మహేంద్రగఢ్‌ రోడ్డులో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు క్యాషియర్ దగ్గర్నుంచి 2 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నాడు. మొత్తం డబ్బు లెక్కించుకోగా, రెండు వేల రూపాయల నోట్లు రెండు చిరిగినట్టు కనిపించాయి.. రూ.1.96 లక్షలను బ్యాగ్‌లో పెట్టి చిరిగిన రెండు 2000 నోట్లను మార్చుకునేందుకు కౌంటర్ వద్దకు వెళ్లాడు. అతను మార్చి తిరిగి వచ్చి చూసేసరికి బ్యాగ్‌లో ఉంచిన డబ్బు మాయం అయింది. షాకైన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకుకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.

బ్యాంకులో ఇద్దరు మహిళలు హరిరామ్‌ను అనుసరిస్తుండడం ఆ వీడియోలో కనిపించింది. బ్యాగులో ఉన్న డబ్బును మహిళలిద్దరూ బయటకు తీశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానిత మహిళల కోసం పోలీసులు వెతుకుతున్నారని మహావీర్ చౌక్ పోలీస్ చౌకీ ఇంచార్జి మనోజ్ తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.

Updated Date - 2022-11-22T16:09:18+05:30 IST

Read more