`తినడం వల్లే పొట్ట పెరుగుతోంది`.. కూతురు చెప్పిన సమాధానంపై తండ్రికి అనుమానం.. గట్టిగా నిలదీస్తే..

ABN , First Publish Date - 2022-11-26T18:37:15+05:30 IST

ఆ బాలిక వయసు 15 సంవత్సరాలు.. కొన్ని నెలలుగా ఆమె పొట్ట పెద్దది అవుతూ వస్తోంది.. అనుమానం వచ్చి అడిగితే.. ఎక్కువ తినడం వల్లే పొట్ట పెరుగుతోందని బుకాయించింది.. తండ్రి ఆమెను గదిలోకి తీసుకెళ్లి సుత్తి తీసుకుని భయపెట్టేసరికి అసలు విషయం బయటపెట్టింది..

`తినడం వల్లే పొట్ట పెరుగుతోంది`.. కూతురు చెప్పిన సమాధానంపై తండ్రికి అనుమానం.. గట్టిగా నిలదీస్తే..

ఆ బాలిక వయసు 15 సంవత్సరాలు.. కొన్ని నెలలుగా ఆమె పొట్ట పెద్దది అవుతూ వస్తోంది.. అనుమానం వచ్చిన తల్లి పొట్ట గురించి ప్రశ్నించింది.. ఆహారం ఎక్కువ తినడం వల్లే పొట్ట పెరుగుతోందని బాలిక బుకాయించింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి ఆమెను గదిలోకి తీసుకెళ్లి సుత్తి తీసుకుని భయపెట్టేసరికి ఆ బాలిక అసలు విషయం బయటపెట్టింది.. ఎదురింటి అబ్బాయి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది.. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్‌కు చెందిన 15 ఏళ్ల బాలికపై అరు నెలల క్రితం ఆమె పొరుగింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది మే నెలలో 15 ఏళ్ల బాలిక తన ఇంటి బయట కూర్చుని ఉంది. అదే సమయంలో ఎదురింటి యువకుడు ఆ అమ్మాయిని పిలిచాడు. అమ్మాయి రావడానికి నిరాకరించడంతో.. అతడు ఆమెను ఆమెను పట్టుకుని, నోరు నొక్కి సమీపంలో ఉన్న గుడిసెలోకి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికను బెదిరించాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. భయపడిన బాలిక ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే ఆ అత్యాచారం వల్ల ఆ బాలిక గర్భం దాల్చింది.

పొట్ట పెరుగుతూ ఉండడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆహరం ఎక్కువగా తినడం వల్లే పొట్ట పెరుగుతోందని బాలిక బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే కూతురు గర్భం దాల్చినట్టు తండ్రికి అనుమానం రావడంతో గట్టిగా నిలదీశాడు. దీంతో ఆ బాలిక నిజం మొత్తం చెప్పేసింది. వెంటనే నిందితుడిపై ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-11-26T18:37:17+05:30 IST