Aadhaar: ఆధార్‌ ప్రోబ్లమా?.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదు

ABN , First Publish Date - 2022-09-09T00:55:17+05:30 IST

దేశవాసులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ గుర్తింపు రుజువైన ఆధార్ కార్డులో సరైన సమాచారం ప్రతిఒక్కరికీ చాలాచాలా ముఖ్యం.

Aadhaar: ఆధార్‌ ప్రోబ్లమా?.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదు

దేశవాసులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ గుర్తింపు రుజువైన ఆధార్ కార్డు(Aadhar card)లో సరైన సమాచారం ప్రతిఒక్కరికీ చాలాచాలా ముఖ్యం. అయితే చాలామంది సమాచారంలో తప్పులు దొర్లుతుంటాయి. వాటిని సరిచేసుకోవడానికి ఆధార్ లేదా ఇతర ఆన్‌లైన్ సేవల సెంటర్లకు పరిగెత్తాల్సి ఉంటుంది. అయితే నాలుగు కీలకమైన కొత్త సేవలు ఉమంగ్(UMANG) యాప్‌(app)పై లభ్యమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉమంగ్అం టే యునిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూఏజ్ గవర్నెన్స్. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన సర్వీసులను ఈ యాప్‌పై వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగానే ఉమాంగ్ యాప్‌పై ఆధార్ సహా పలు కీలకమైన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.


పౌరుల కేంద్రంగా సర్వీసులు అందించడమే లక్ష్యంగా ఉమాంగ్ యాప్‌(UMANG app)పై ‘మై ఆధార్’ ద్వారా నాలుగు కొత్త సేవలను జతచేసినట్టు ఆఫీషియల్‌గా ప్రకటన వెలువడింది. ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా 97183-97183 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం వివరాలు తెలుసుకోవచ్చని ఉమాంగ్ యాప్ ఆఫీషియల్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. ఆ వివరాలు ఏవో చూద్దాం..


కొత్తగా జతచేసిన సర్వీసులు ఇవే..

- ఆధార్ వెరిఫికేషన్: పౌరులు తమ ఆధార్ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు.

- ఎన్‌రోల్‌మెంట్ లేదా అప్‌డేట్ రిక్వెస్ట్ అప్‌డేట్‌ని తెలుసుకోవచ్చు.

- ఆధార్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్ లేదా ఈ-మెయిల్‌ని వేరిఫై చేసుకోవచ్చు.

- రిట్రైవ్ ఈఐడీ లేదా ఆధార్ నంబర్‌: ఈ సర్వీసు ద్వారా ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ(ఈఐడీ) తిరిగి అన్వేషించవచ్చు. 


ఉమాంగ్ యాప్‌పై లభ్యమయ్యే మిగతా ఆధార్ సర్వీసులు ఇవే..

- ఆధార్ డౌన్‌లోడ్.

- జనరేట్ వర్చువల్ ఐడీ

- అథంటికేషన్ హిస్టరీ

- ఆఫ్‌లైన్ ఈ-కేవైసీ

- పేమెంట్ హిస్టరీ లాక్, అన్‌లాక్ బయోమెట్రిక్


ఈ సేవలు ఎలా పొందాలి..

స్టెప్ 1: ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2: మై ఆధార్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: ఆధార్ లింక్ చేయమని కోరుతుంది.

స్టెప్ 4: ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.

స్టెప్ 5: ఓటీపీ ఎంటర్‌ చేసి సేవ్‌పై క్లిక్ చేయాలి.

ఒకసారి ఆధార్ లింక్ పూర్తయ్యాక ఎలాంటి అవరోధాలు లేకుండా మిగతా సేవలు పొందొచ్చు. 

Updated Date - 2022-09-09T00:55:17+05:30 IST