gambling and betting: రమ్మీ వంటి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడుతున్నారా?.. ఇకపై గెలుపొందాక..

ABN , First Publish Date - 2022-10-02T23:36:05+05:30 IST

ఆన్‌లైన్ అయినా.. ఆఫ్‌లైన్ అయినా గ్యాంబ్లింగ్ (Gambling), బెట్టింగ్ (betting)లు జీఎస్టీ చట్టం కింద సర్వీసుగానే పరిగణించబడతాయి.

gambling and betting: రమ్మీ వంటి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడుతున్నారా?.. ఇకపై గెలుపొందాక..

న్‌లైన్ అయినా.. ఆఫ్‌లైన్ అయినా గ్యాంబ్లింగ్ (Gambling), బెట్టింగ్ (betting)లు జీఎస్టీ చట్టం కింద సర్వీసుగానే పరిగణించబడతాయి. గేమ్స్‌ ఆఫ్ ఛాన్స్‌గా పేర్కొనే బెట్టింగ్, గ్యాంబ్లింగ్స్‌లపై ప్రస్తుతం  18 శాతం, ఈ-స్టోర్ట్స్, కార్డ్ బేస్డ్ గేమ్స్‌ వంటి గేమ్స్ ఆఫ్ స్కిల్‌పై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. గ్రాస్ గేమింగ్ వ్యాల్యూ లేదా గ్రాస్ గేమింగ్ రెవెన్యూ లేదా సర్వీసు ఫీజు ఆధారంగా జీఎస్టీ రేటుని నిర్ణయిస్తారు. ఈ కారణంగానే ప్లేయర్ల గెలుపోటములతో జీఎస్టీ వసూళ్లకు సంబంధం ఉండదు. అయితే ఆన్‌లైన్ గేమ్స్ ఆడి గెలుపొంది పన్నులు ఎగవేస్తున్న వ్యక్తులపై చర్యలకు ఆదాయ పన్ను విభాగం (Income tax department) ఉపక్రమించింది. ట్యాక్సులు ఎగవేసే వ్యక్తులకు నోటీసులు జారీ చేయడాన్ని అధికారులు ఇప్పటికే ఆరంభించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చీఫ్ నితిన్ గుప్తా ఇదివరకే తెలిపారు. ఈ క్రమంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ పోర్టల్ ‘గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్’కు సెప్టెంబర్ చివరిలో జీఎస్టీ ఇంటెలిజెన్సీ విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ట్యాక్సులు, వడ్డీ, జరిమానా కలిపి మొత్తం రూ.21 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.


మరోవైపు ‘‘ రమ్మీ (Rummy) వంటి ఆన్‌లైన్ స్కిల్-ఆధారిత గేమ్స్‌లో కొన్నింటిని తప్పుగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్స్‌గా వర్గీకరిస్తున్నారు’’ అని క్లియర్ (Clear) సంస్థ ఫౌండర్, సీఈవో అర్చిత్ గుప్తా పేర్కొన్నారు. అధిక జీఎస్టీ కారణంగా బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్‌లు బ్లాక్ మార్కెట్ బాట పడుతున్నాయని చెప్పారు. ఈ కారణంగానే దేశీయ గేమింగ్ ఇండస్ట్రీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) రావడంలేదని గుప్తా చెప్పారు.

Updated Date - 2022-10-02T23:36:05+05:30 IST