జోరుగా గల్ఫ్‌ దేశాలతో వాణిజ్యం

ABN , First Publish Date - 2022-06-07T09:21:14+05:30 IST

గల్ఫ్‌ సహకార మండలిలోని (జీసీసీ) 6 దేశాలతో భారత ద్వైపాక్షిక వాణి జ్యం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 58.26 శాతం పెరిగి 4,400 కోట్ల డాలర్లకు

జోరుగా గల్ఫ్‌ దేశాలతో వాణిజ్యం

2021-22లో  రూ.3.30 లక్షల కోట్లుగా నమోదు


న్యూఢిల్లీ: గల్ఫ్‌ సహకార మండలిలోని (జీసీసీ) 6 దేశాలతో భారత ద్వైపాక్షిక వాణి జ్యం 2021-22 ఆర్థిక సంవత్సరంలో  ఏకంగా 58.26 శాతం పెరిగి 4,400 కోట్ల డాలర్లకు (రూ.3.30 లక్షల కోట్లు) చేరింది. 2020-21లో ఇది 2,780 కోట్ల డాలర్లుంది. అధికార బీజేపీ ప్రతినిధి ఒకరు మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల పట్ల ఉభయ దేశాల మధ్య దౌత్యపరమైన వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో జీసీసీ దేశాలతో వాణిజ్యానికి ప్రాముఖ్యత ఏర్పడింది. అలాగే జీసీసీ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (ఎఫ్‌టీపీ) చర్చలకు భారత్‌ కృషి చేస్తున్న సమయంలో కూడా ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూఏఈతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 10,000 కోట్ల డాలర్లకు పెంచే లక్ష్యంతో కుదుర్చుకున్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ఇప్పటికే అమలులో ఉంది. ఇదిలా ఉండగా 2020 -21తో పోల్చితే 2022-23లో జీసీసీలోని ఆరు దేశాలకు భారత ఎగుమతులు 9.51 శాతం నుంచి 10.4 శాతానికి, దిగుమతులు 15.5 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


ద్వైపాక్షిక వాణిజ్యం 874 కోట్ల డాలర్ల నుంచి 15,473 కోట్ల డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. 2021-22లో జీసీసీ దేశాలకు చేసిన ఎగుమతుల్లో టాప్‌ 5లో ముత్యాలు, విలువైన, ఒక మోస్తరు విలువైన వజ్రాలు, ప్రీమియం మెటల్స్‌, ఇమిటేషన్‌ ఆభరణాలు, విద్యుత్‌ యంత్రాలు, పరికరాలు, సౌండ్‌ రికార్డర్లు, రీ ప్రొడ్యూసర్లు, టెలివిజన్‌ ఇమేజ్‌, సౌండ్‌ రికార్డర్లు ఉన్నాయి. జీసీసీ నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల్లో క్రూడాయిల్‌, సహజ వాయువు అధిక వాటా. కలిగి ఉన్నాయి. 2020-21లో జీసీసీ దేశాల నుంచి 11,073 కోట్ల డాలర్ల విలువ గల వస్తువులు భారత్‌ దిగుమతి చేసుకుంది.  

Updated Date - 2022-06-07T09:21:14+05:30 IST