అమెరికా స్టైల్‌లో తయారు చేసిన ఈ ఫుడ్‌ట్రక్ చూశారా.. ఆశ్చర్యపోవాల్సిందే..

ABN , First Publish Date - 2022-09-18T03:03:17+05:30 IST

తక్కువ పెట్టుబడితో మంచి రాబడి సాధించాలంటే ఫుడ్‌ట్రక్‌ల్లో చిన్నపాటి హోటల్‌ నిర్వహించవచ్చు. ఇక ఫుడ్‌ట్రక్‌లకు(Food Trucks) ఉన్న డిమాండ్ దృష్ట్యా అజిముత్ అనే కంపెనీ సరికొత్త డిజైన్‌తో ఓ ఫుడ్‌ట్రక్‌ను భారత్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

అమెరికా స్టైల్‌లో తయారు చేసిన ఈ ఫుడ్‌ట్రక్ చూశారా.. ఆశ్చర్యపోవాల్సిందే..

ఇంటర్నెట్ డెస్క్: తక్కువ పెట్టుబడితో మంచి రాబడి సాధించాలంటే ఫుడ్‌ట్రక్‌లో చిన్నపాటి హోటల్‌ నిర్వహించవచ్చు. ఇక ఫుడ్‌ట్రక్‌లకు(Food Trucks) ఉన్న డిమాండ్ దృష్ట్యా అజిముత్ అనే కంపెనీ సరికొత్త డిజైన్‌తో ఓ ఫుడ్‌ట్రక్‌ను భారత్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అమెరికా ఫుడ్‌ట్రక్‌లలో సాధారణంగా కనిపించే సదుపాయాలన్నీ ఇందులో ఏర్పాటు చేశారు. క్యాప్సూల్ ఆకారంలో ఉండే దీన్ని మొత్తం స్టీల్‌తో తయారు చేశారు. 20 అడుగుల పొడవు ఉండే ఈ ట్రక్‌లోని కించెన్‌లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. 


ఇండియాలో ఇప్పటికే ఫుడ్‌ట్రక్‌లు ఉన్నప్పటికీ.. సరికొత్త డిజైన్ కారణంగా తమ ట్రక్స్‌ మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది. నోయిడాకు చెందిన అజిముత్‌ కంపెనీకి(Azimuth) తమిళనాడు, గోవాలో ట్రక్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. తాజ్ కిమ్, హల్దీరామ్స్, స్టార్‌బక్స్, 24సెవెన్, చాయ్‌పాయింట్, రెబల్ ఫుడ్స్, నెస్లే, వంటి ప్రముఖ సంస్థలన్నీ తమ ఉత్పత్తులు వినియోగించుకుంటున్నాయని సంస్థ చెబుతోంది. 


‘‘ త్వరలో మేము పూణెలో కూడా ఓ వర్క్ షాపును ప్రారంభించబోతున్నాం. ఫుడ్ ట్రక్ తయారీ రంగంలో అవకాశాలు చాలా ఉన్నాయి. హోటళ్ల నిర్వహకులే కాకుండా.. కాస్మొటిక్ కంపెనీలు కూడా తన ఉత్పత్తుల ప్రచారాన్ని ఫుడ్ ట్రక్‌ల సాయంతో నిర్వహిస్తున్నాయి. మా ఫుడ్ ట్రక్ ధర రూ.20 లక్షలు’’ అని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ట్రక్ గోడలన్నీ స్టీల్‌తోనే నిర్మించారు. ట్రక్ లోపల వంట చేసేందుకు అనువుగా బోలెడన్ని సదుపాయాలు కల్పించారు. 


బర్నర్లు, గ్రిడల్స్, ఫ్రైయర్లు, కాంబీ ఓవెన్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌తో సహా అనేకం ఇందులో అమర్చారు. ఏ రకమైన వంటకాన్ని అయినా వండేందుకు వీలుగా ట్రక్‌ లోపల సదుపాయాలను కల్పించారు. ఈ ఫుడ్ ట్రక్ కాస్త పెద్దగా ఉన్నప్పటికీ.. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కొన్ని చిన్న ట్రక్‌లను కూడా తయారు చేశామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా.. వినియోగదారులు తెచ్చిన ట్రక్‌లలో వారి అభిరుచికి తగ్గట్టుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. 

Read more