మార్కెట్లోకి ఆల్టీగ్రీన్‌ ఎలక్ట్రిక్‌ కార్గో ఆటోలు ప్రారంభ ధర రూ.4 లక్షలు

ABN , First Publish Date - 2022-09-24T08:21:11+05:30 IST

ఎలక్ట్రిక్‌ త్రిచక్ర కార్గో వాహన తయారీ కంపెనీ ఆల్టీగ్రీన్‌.. హైదరాబాద్‌ మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కార్గో ఆటోలను విడుదల చేసింది.

మార్కెట్లోకి ఆల్టీగ్రీన్‌ ఎలక్ట్రిక్‌ కార్గో ఆటోలు ప్రారంభ ధర రూ.4 లక్షలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎలక్ట్రిక్‌ త్రిచక్ర కార్గో వాహన తయారీ కంపెనీ ఆల్టీగ్రీన్‌.. హైదరాబాద్‌ మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కార్గో ఆటోలను విడుదల చేసింది. డిసెంబరు చివరి నాటికి 25 పట్టణాలకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 40 పట్టణాలకు విస్తరించనున్నామని ఆల్టీగ్రీన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అమితాబ్‌ సరన్‌ తెలిపారు. హైదరాబాద్‌లో కంపెనీ డీలర్‌షిప్‌ ‘రామ్‌ ఎలక్ట్రిక్‌’ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఇటీవల సిక్త్‌సెన్స్‌, రిలయన్స్‌ ఎనర్జీ, ఎక్స్‌పొన్షియా వంటి సంస్థలు ఆల్టీగ్రీన్‌కు రూ.300 కోట్ల నిధులు సమకూర్చాయి. ఇందులో రిలయన్స్‌ ఎనర్జీ రూ.60 కోట్లు సమకూర్చినట్లు చెప్పారు. ఈ నిధులను ఉత్పత్తి పెంపు, పంపిణీ వ్యవస్థను విస్తరించడానికి ఆల్టీగ్రీన్‌ వినియోగించుకోనుంది. కాగా ఈ ఆటో ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.4 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

Read more