చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు మారాయ్‌..

ABN , First Publish Date - 2022-09-30T06:19:41+05:30 IST

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఐదింటి వడ్డీ రేటును 0.30 శాతం వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మిగతా ఏడు పథకాల వడ్డీ రేట్లు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు మారాయ్‌..

 ఐదు స్కీమ్స్‌పైౖ 0.30ు వరకు పెంపు 

 పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌సీ, సుకన్య సమృద్ధి 

సహా ఏడు పథకాల రేట్లు యథాతథం 

అక్టోబరు-డిసెంబరు కాలానికి వర్తింపు 


న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఐదింటి వడ్డీ రేటును 0.30 శాతం వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మిగతా ఏడు పథకాల వడ్డీ రేట్లు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు కొత్త రేట్లు వర్తిస్తాయి. స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ రేట్లను సవరించడం తొమ్మిది త్రైమాసికాల తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. రెపో రేటు పెంపుతో బ్యాంక్‌ డిపాజిట్‌ రేట్లూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం.. ఆదాయ పన్ను రాయితీ లభించని స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ వడ్డీ రేట్లను మాత్రమే పెంచింది. ఈ జాబితాలో రెండేళ్లు, మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌ పథకాలతో పాటు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఉన్నాయి. కిసాన్‌ వికాస్‌ పత్రాల (కేవీపీ) వడ్డీ రేటుతో పాటు కాలపరిమితిని కూడా సవరించింది. అయితే, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ (ఎన్‌ఎ్‌ససీ), సుకన్య సమృద్ధి యోజన (ఎ్‌సఎ్‌సవై)తోపాటు ఏడాది, ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్‌ పథకాల రేట్లను మాత్రం యథాతథంగా కొనసాగించింది. మార్కెట్లో బాండ్ల రేట్లలో మార్పులకు అనుగుణంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి మూడు నెలలకోసారి చిన్న మొత్తాల పొదుపు రేట్లను సవరిస్తుంటుంది. 

Read more