తేయాకు తోటలకు heavy rainfall దెబ్బ...వరదలతో తగ్గనున్న tea పొడి ఉత్పత్తి

ABN , First Publish Date - 2022-07-13T13:55:38+05:30 IST

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు(heavy rainfall), వరదల వల్ల తేయాకు తోటలకు దెబ్బ తగిలింది....

తేయాకు తోటలకు heavy rainfall దెబ్బ...వరదలతో తగ్గనున్న tea పొడి ఉత్పత్తి

డార్జిలింగ్ (పశ్చిమబెంగాల్): గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు(heavy rainfall), వరదల వల్ల తేయాకు తోటలకు దెబ్బ తగిలింది. దేశంలోని మొత్తం తేయాకు ఉత్పత్తిలో దాదాపు 81 శాతం వాటా కలిగిన అసోం, పశ్చిమ బెంగాల్‌లోని తేయాకు పరిశ్రమ ప్రకృతి ప్రకోపానికి గురైంది. మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, ఆ తర్వాత వచ్చిన వరదలు ఈ ప్రాంతంలోని తేయాకు రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.అసోంలో గత ఏడాది ఉత్పత్తితో పోలిస్తే జూన్‌ నెలలో టీ ఉత్పత్తి 27 శాతం తగ్గింది. బ్రహ్మపుత్ర లోయలో 11 శాతం, బరాక్ లోయలో 16 శాతం తేయాకు ఉత్పత్తి తగ్గుదల నమోదైంది.తేయాకు తోటలు కరవు లేదా వరదలను తట్టుకోలేవు. 


తమ ప్రాంతంలోని తేయాకు తోటలు వరదల విపత్తుకు ఉత్పత్తి దెబ్బతిందని టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అసోం శాఖ కార్యదర్శి దీపాంజల్ దేకా చెప్పారు. ‘‘ తేయాకు తోటల నష్టాలు ప్రారంభ రికార్డులు మాత్రమే. తేయాకు తోటలకు జరిగిన ఖచ్చితమైన నష్టాన్ని గుర్తించిన తర్వాత మేం 15 నుంచి 20 రోజుల తర్వాత వాస్తవ నష్టాన్ని అంచనా వేయగలుగుతాం’’ అని దీపాంజల్ వివరించారు.పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని దూర్స్-తెరాయ్ టీ తోటలు జూన్‌లో తేయాకు ఉత్పత్తిలో 40 శాతం తగ్గుదలని ఎదుర్కొన్నాయి. తేయాకు ఉత్పత్తిలో తగ్గుదల సగటు గరిష్ట ఉష్ణోగ్రతలో మార్పులని చెప్పవచ్చు. దీని ఫలితంగా సగటు సూర్యరశ్మి గంటలు తగ్గుతాయి.


పశ్చిమ బెంగాల్‌లో ఎగుమతులు తగ్గడం, పురుగుమందుల ధరలు పెరగడం, తేయాకు తోటల కార్మికుల రోజువారీ వేతనం రూ.30 పెరగడం కూడా ఈ ప్రాంతంలోని తేయాకు రంగాన్ని ప్రభావితం చేసింది. భారీవర్షాలు, వరదలు, తగ్గిన ఎగుమతులు ప్రస్తుత సీజన్‌లో తేయాకు పరిశ్రమ స్థితిని బలహీనంగా మార్చింది.


Read more