హువే పన్ను ‘ఎగవేత’ నిజమే : సీబీడీటీ

ABN , First Publish Date - 2022-03-04T08:12:28+05:30 IST

చైనా టెలికాం కంపెనీ హువే పన్ను ఎగవేత నిజమేనని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రకటించింది. ..

హువే పన్ను ‘ఎగవేత’ నిజమే : సీబీడీటీ

న్యూఢిల్లీ: చైనా టెలికాం కంపెనీ హువే పన్ను ఎగవేత నిజమేనని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రకటించింది. పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తక్కువగా చూపేందుకు, అర్థంపర్థం లేని ఖర్చులను కావాలనే ఖాతా పుస్తకాల్లో రాసిందని పేర్కొంది. ఇటీవల ఐటీ అధికారులు ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపినప్పుడు ఈ విషయం బయటపడినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. గత నెల 15న ఐటీ అధికారులు హువే వ్యాపార కార్యాలయాలు, ఆ సంస్థ కీలక అధికారుల నివాసాల్లో సోదా లు జరిపారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తక్కువగా చూపేందుకు రాయల్టీ చెల్లింపులకు రూ.350 కోట్లు, సాంకేతిక సేవల పేరుతో రూ.150 కోట్లు చెల్లించినట్టు తన ఖాతా పుస్తకాల్లో చూపినట్టు ఈ సోదాల్లో ఐటీ అధికారులు గుర్తించారు. 

Updated Date - 2022-03-04T08:12:28+05:30 IST