ఐఫోన్‌ తయారీలోకి టాటా?

ABN , First Publish Date - 2022-09-10T06:27:00+05:30 IST

ఐఫోన్‌ తయారీలోకి టాటా?

ఐఫోన్‌ తయారీలోకి టాటా?

న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్‌ ఐఫోన్‌ను అస్లెంబింగ్‌  చేసేందుకు టాటా గ్రూప్‌ ప్రణాళికలు రచిస్తోంది.  ఇందుకోసం తైవాన్‌ కేంద్రంగా పనిచేసే విస్ట్రాన్‌ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌ కంపెనీలు ఐఫోన్లను అసెంబుల్‌ చేసే యాపిల్‌ కంపెనీకి సరఫరా చేస్తుంటాయి. ఈ రెండు కంపెనీలకు భారత్‌లో ప్లాంట్లు ఉన్నాయి. విస్ట్రాన్‌ ఈక్విటీలో వాటా తీసుకోవడం లేదా జాయింట్‌ వెంచర్‌ (జేవీ) ద్వారా ప్రత్యేక ప్లాంట్‌ ఏర్పాటు చేసి ఈ విషయంలో ముందుకు వెళ్లాలని టాటా గ్రూప్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రెండు కంపెనీలు ఈ అంశంపై స్పందించలేదు.  ప్రస్తుతం విస్ట్రాన్‌, ఫాక్స్‌కాన్‌ కంపెనీలు యాపిల్‌ కంపెనీకి సరఫరా చేసే ఐఫోన్లలో 80 శాతం చైనాలోనే అసెంబుల్‌ చేస్తున్నాయి. కొవిడ్‌ లాక్‌డౌన్లు, అమెరికా-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి సరఫరాలకు అంతరాయం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాపిల్‌ కంపెనీ భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ అసెంబ్లింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతోంది.  

Read more