బ్లాక్ డీల్స్ తెచ్చిన తంటా.. పతనం దిశగా Syngene Shares..

ABN , First Publish Date - 2022-09-06T16:51:54+05:30 IST

సింజీన్ ఇంటర్నేషనల్ షేర్లు(Syngene International Shares) నేడు పతనం బాట పట్టాయి. మంగళవారం బీఎస్ఈ(BSE)లో

బ్లాక్ డీల్స్ తెచ్చిన తంటా.. పతనం దిశగా Syngene Shares..

Syngene shares : సింజీన్ ఇంటర్నేషనల్ షేర్లు(Syngene International Shares) నేడు పతనం బాట పట్టాయి. మంగళవారం బీఎస్ఈ(BSE)లో బ్లాక్ డీల్స్(Block Deals) ద్వారా కంపెనీ ఈక్విటీలో దాదాపు 6 శాతం చేతులు మారడంతో స్టాక్ కష్టాల్లో పడిపోయింది. దీంతో సింజీన్ ఇంటర్నేషనల్ షేర్లు ఉదయం 10:14 గంటలకు 1 శాతం తగ్గి రూ.573.95 వద్ద ట్రేడయ్యాయి.


ఉదయం 09:15 గంటలకు సింజీన్ మొత్తం ఈక్విటీ(Total Equity)లో 5.65 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 22.68 మిలియన్ ఈక్విటీ షేర్లు బీఎస్ఈలో షేరుకు రూ. 585.80 చొప్పున మారాయి. బీఎస్‌ఈలో గత ముగింపు రూ.578.75తో పోలిస్తే ఈ షేరు 3 శాతం క్షీణించి రూ.561.75 వద్ద ప్రారంభమైంది. ఇది ఇప్పటివరకు ఇంట్రా-డే(Intra Day)లో గరిష్టంగా రూ.599, కనిష్టంగా రూ.559కి చేరింది. 


జూన్ 30, 2022 నాటికి, మొత్తం ప్రమోటర్ల హోల్డింగ్(Promotors Holding) 70.29 శాతం, బయోకాన్ సింజీన్‌(Biocon Syngene)లో 69.99 శాతం వాటాను కలిగి ఉన్నారు. గత వారంలో సింజీన్ 4 శాతం పడిపోయి మార్కెట్‌ను బలహీనపరిచింది. సెన్సెక్స్‌(Sensex)లో 0.30 క్షీణించింది. గత ఏడాది కాలంలో స్టాక్ 8 శాతం నష్టపోయింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌(Benchmark Index)లో 1.8 శాతం లాభపడింది. ఇది ఫిబ్రవరి 22, 2022న 52 వారాల కనిష్ట స్థాయి రూ.508కి చేరింది.

Updated Date - 2022-09-06T16:51:54+05:30 IST