Rakesh Jhunjhunwala : 52 వారాల కనిష్టం నుంచి 51% జూమ్ చేసిన స్టాక్..

ABN , First Publish Date - 2022-08-02T19:42:27+05:30 IST

బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్ ఒకటి 52 వారాల కనిష్టం నుంచి 51% జూమ్ చేశాయి.

Rakesh Jhunjhunwala : 52 వారాల కనిష్టం నుంచి 51% జూమ్ చేసిన స్టాక్..

Rakesh Jhunjhunwala : బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్ ఒకటి 52 వారాల కనిష్టం నుంచి 51% జూమ్ చేశాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్(Star Health Insurance) షేర్లు కేవలం 21 ట్రేడింగ్ సెషన్‌ల(Trading sessions)లో లేదా ఒక నెలలో 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 51% జూమ్ చేశాయి. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో(Rakesh Jhunjhunwala Portfolio)లో భాగమైన ఈ స్టాక్, జూలై 1, 2022న 52 వారాల కనిష్ట స్థాయి రూ.469.05కి చేరింది. స్టార్ హెల్త్ షేర్(Star Health share) ఆగస్ట్ 1న రూ.710.20 వద్ద ముగిసింది. ఇది ఒక నెలలో పెట్టుబడిదారుల(Investments)కు 51.41 శాతం రాబడిని అందించింది. 


స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టాక్(Star Health Insurance Stock) డిసెంబర్ 10, 2021న 52 వారాల గరిష్ట స్థాయి రూ.940 నుండి 23.3 శాతం తక్కువగా ట్రేడవుతోంది. రాకేష్ ఝున్‌‌ఝున్‌వాలా స్టార్ హెల్త్ ప్రమోటర్(Star Health Promoter). అతను (14.39 శాతం లేదా 8.28 కోట్ల షేర్లు), ఆయన భార్య రేఖా ఝున్‌‌ఝున్‌వాలా(Rekha Jhunjhunwala) (3.10 శాతం లేదా 1.78 కోట్ల షేర్లు) జూన్ 2022 త్రైమాసికం నాటికి సంస్థలో 17.49 శాతం వాటాను కలిగి ఉన్నారని షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్ డేటా చూపిస్తుంది.


ఇంట్రాడే మూమెంట్..


ఉదయం 11:50 గంటలకు బీఎస్ఈ(BSE)లో క్రితం ముగింపు రూ.710.20 నుంచి ఈరోజు 1.5% పెరిగి షేరు రూ.720.90 వద్ద ట్రేడవుతోంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టాక్ ఈరోజు 2.06% పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.724.8కి చేరింది. 2022లో షేరు 8.41 శాతం నష్టపోయింది కానీ వారంలో 3.27 శాతం లాభపడింది. సంస్థకు చెందిన మొత్తం 0.31 లక్షల షేర్లు బీఎస్ఈలో రూ. 2.22 కోట్ల టర్నోవర్‌గా మారాయి. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్(Market Cap) రూ.41,536 కోట్లకు పెరిగింది.


షేర్ హోల్డర్స్..


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో, 1,73,836 పబ్లిక్ షేర్‌హోల్డర్స్ సంస్థలో 41.16 శాతం లేదా 23.71 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. గత త్రైమాసికంలో ఐదుగురు ప్రమోటర్లు(Promoters) 58.84 శాతం వాటా లేదా 33.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. 1,72,097 మంది షేర్‌హోల్డర్లు సంస్థలో 78.46 లక్షల షేర్లను కలిగి ఉన్నారు, ఇది రూ. 2 లక్షల వరకూ వ్యక్తిగత షేర్ క్యాపిటల్‌(Individual Share Capital)తో 1.36 శాతం వాటాను కలిగి ఉంది. 33 మంది పబ్లిక్ షేర్‌హోల్డర్లు(Public Shareholders) సంస్థలో 22.62 లక్షల షేర్లను కలిగి ఉన్నారు, ఇది రూ. 2 లక్షలకు పైగా వ్యక్తిగత షేర్ క్యాపిటల్‌తో 0.39 శాతం వాటాను కలిగి ఉంది.

Updated Date - 2022-08-02T19:42:27+05:30 IST