Stock Market : భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్..

ABN , First Publish Date - 2022-07-29T15:54:00+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ నేడు భారీగా లాభపడింది. సెన్సెక్స్(Sensex) 644 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ(Nifty) 205 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

Stock Market : భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్..

Stock Market : స్టాక్‌ మార్కెట్‌ నేడు భారీగా లాభపడింది. సెన్సెక్స్(Sensex) 644 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ(Nifty) 205 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్(Tata Steel), బజాజ్ ఫిన్‌సర్వ్(Bajaj Finserv), పవర్ గ్రిడ్(Power Grid), టైటాన్(Titan), ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ, విప్రో(Wipro), నెస్లే(Nestle) 2 శాతం వరకు లాభపడ్డాయి. కాగా.. నిరాశాజనకమైన క్యూ1 ఫలితాల తర్వాత డాక్టర్ రెడ్డీస్ 4 శాతం క్షీణించింది. ఇది సన్ ఫార్మా, సిప్లా, దివీస్ ల్యాబ్స్ 1 శాతం వరకు స్లిప్ అవడంతో ఇతర ఫార్మా మేజర్‌లు సైతం అదే బాటను అనుసరిస్తున్నాయి. 


బ్రాడర్ మార్కెట్లు కూడా గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్(BSE Midcap), స్మాల్ క్యాప్ సూచీలు(Small Cap Indices) 0.9 శాతం వరకు పెరిగాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో(Nifty Auto), ఐటీ(IT), మెటల్స్ 1 శాతానికి పైగా లాభపడ్డాయి. రియాల్టీ ఇండెక్స్ నోటబుల్ విన్నర్‌గా నిలవగా, ఫార్మా ఇండెక్స్ 0.9 శాతం పడిపోయింది. స్టాక్‌లలో వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్(Westlife Development) 6 శాతంపైగా పెరిగి లాభాలను పొడిగించింది. ఏడాది క్రితం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.33.39 కోట్ల నికర నష్టం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.23.57 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Updated Date - 2022-07-29T15:54:00+05:30 IST