భారత్ పట్ల స్పెయిన్ పత్రిక అతి.. మరీ దారుణంగా దిగజారి చేసిన పనిది

ABN , First Publish Date - 2022-10-14T21:58:29+05:30 IST

స్పెయిన్‌కు (spain) చెందిన ప్రధాన పత్రిక ‘ లా వంగార్డియా’ (La Vanguardia) భారత్ పట్ల కాస్త అతిగా ప్రవర్తించింది. భారత ఆర్థిక స్థితి, వృద్ధిపై ప్రచురించిన ప్రత్యేక కథనంలో పాములు ఆడించే వ్యక్తి (snake charmer) కార్టూన్‌ను వాడింది.

భారత్ పట్ల స్పెయిన్ పత్రిక అతి.. మరీ దారుణంగా దిగజారి చేసిన పనిది

స్పెయిన్‌కు (spain) చెందిన ప్రధాన పత్రిక ‘ లా వంగార్డియా’ (La Vanguardia) భారత్ పట్ల అతిగా ప్రవర్తించింది. ‘పాములు ఆడించే వ్యక్తి’ (snake charmer) ప్రతిబింబించే కార్టూన్‌ను ఉపయోగించి భారత ఆర్థిక వృద్ధిని వర్ణించింది. భారత్ పట్ల మూసభావననే ప్రతిబింబిస్తూ ప్రచురించిన ఈ కార్టూన్ ద్వారా జాతివిద్వేషాన్ని వెళ్లగక్కుతున్నట్టుగా ఉంది. ఈ కార్టూన్‌ను అక్టోబర్ 9న  వీక్లీ పత్రికలో  మొదటి పేజీలో పబ్లిష్ చేసింది. ‘ ది హవర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ’ పేరిట భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని ‘పాములు ఆడించే వ్యక్తి’ కార్టూన్‌తో వర్ణించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ స్వాతంత్ర్యం పొంది దశాబ్ధాలు గడుస్తున్నా, శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా ఇంకా మూసభావనలోనే భారత్‌ను పోల్చడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


దీనిపై బెంగళూరు సెంట్రల్ బీజేపీ లోక్‌సభ ఎంపీ పీసీ మోహన్ స్పందించారు. దృఢమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌కు గ్లోబల్ గుర్తింపు ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా తమను పాముల్ని ఆడించేవాళ్లగా చూపడం మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. విదేశీ మనస్థత్వాలను మార్చాలనే ప్రయత్నం కాస్త కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు.  స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జిరోధా (Zerodha) సీఈవో నితిన్ కామన్ స్పందిస్తూ.. ‘‘ కాస్త శాంతించండి ప్రపంచం చూస్తోంది. కానీ భారత్‌ను ఇంకా  సాంప్రదాయ   కార్టూన్లతో చూపించడం అవమానకరమే ’’ అని వ్యాఖ్యానించారు.





Updated Date - 2022-10-14T21:58:29+05:30 IST