Zomatoకు భారీ షాక్.. రికార్డ్ స్థాయిలో కుప్పకూలిన షేర్లు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-25T18:17:32+05:30 IST

జొమాటోకు భారీ షాక్ తగిలింది. లాక్-ఇన్ పీరియడ్(Lock In Period) ముగియడంతో ఫుడ్-డెలివరీ ప్లాట్‌ఫారమ్ కంపెనీ జొమాటో(Zomato) షేర్లు దారుణంగా పడిపోయాయి.

Zomatoకు భారీ షాక్.. రికార్డ్ స్థాయిలో కుప్పకూలిన షేర్లు.. కారణం ఏంటంటే..

Zomato : జొమాటోకు భారీ షాక్ తగిలింది. లాక్-ఇన్ పీరియడ్(Lock In Period) ముగియడంతో ఫుడ్-డెలివరీ ప్లాట్‌ఫారమ్ కంపెనీ జొమాటో(Zomato) షేర్లు దారుణంగా పడిపోయాయి. ప్రీ-ఐపీఓ(Pre IPO) లాక్-ఇన్ పీరియడ్ ముగియడంతో సోమవారం ఇంట్రా-డే(Intra day)లో స్టాక్ బీఎస్‌ఈ(BSE)లో 14 శాతం పడిపోయింది. జొమాటో షేర్లు రికార్డు స్థాయిలో రూ.46కి చేరాయి. మే 11, 2022న చేరిన దాని మునుపటి కనిష్ట స్థాయి రూ.50.35 కంటే దిగువకు పడిపోవడం గమనార్హం.


నేటి పతనంతో జొమాటో ఇప్పుడు దాని ఇష్యూ ధర రూ. 76 కంటే 39 శాతం తక్కువగా ట్రేడవుతోంది. నవంబర్ 16, 2021న స్టాక్ రికార్డు స్థాయిలో రూ.169.10కి చేరుకుంది. జొమాటో జూలై 23, 2021న స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఉదయం 10:15 గంటలకు.. జోమాటో భారీ వాల్యూమ్‌ల నేపథ్యంలో 12 శాతం తగ్గి రూ.47.45 వద్ద కోట్ చేసింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 0.6 శాతం క్షీణించి 55,725 వద్ద ఉంది. 


ఎన్‌ఎస్‌ఈ, బీఎస్ఈలలో 104.62 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారడంతో కౌంటర్‌లో ట్రేడింగ్ వాల్యూమ్‌లు మూడు రెట్లు పెరిగాయి. ప్రి ఐపీఓ ఇన్వెస్టర్ల లాక్ ఇన్ పిరియడ్ జూలై 23, 2022న ముగిసింది. దీంతో ఇన్వెస్టర్స్ అంత తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ రోజు 14 శాతానికిపైగా క్రాష్‌ అయ్యాయి. లిస్టింగ్ అయినప్పటి నుంచి జొమాటో విలువలో 60శాతం కంటే ఎక్కువగా నష్టపోయింది.

Updated Date - 2022-07-25T18:17:32+05:30 IST