అంచనాలను మించిన ITC క్యూ1 ఫలితాలు.. మూడేళ్ల గరిష్టానికి స్టాక్

ABN , First Publish Date - 2022-08-02T17:09:43+05:30 IST

జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌(ITC Ltd) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది.

అంచనాలను మించిన ITC క్యూ1 ఫలితాలు.. మూడేళ్ల గరిష్టానికి స్టాక్

ITC Shares : జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌(ITC Ltd) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో సిగరెట్-టు-హోటల్‌(cigarettes-to-hotels)ల మేజర్ అంచనాలను మించి మెరుగైన అమ్మకాల వృద్ధిని సాధించింది. మంగళవారం ఇంట్రా-డే(Intra day)లో ఐటీసీ షేర్లు బీఎస్ఈ(BSE)లో 3 శాతం పెరిగి మూడు సంవత్సరాల గరిష్ట స్థాయి రూ. 316.65కి చేరుకున్నాయి. సెప్టెంబరు 2018 నుంచి స్టాక్ అత్యధిక స్థాయిలో ట్రేడ్ అవుతోంది. 


కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం(Net Profit) 33 శాతం ఎగసి రూ. 4,462 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,343 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం జంప్‌చేసి రూ. 19,831 కోట్లను దాటింది. గత క్యూ1లో రూ. 14,241 కోట్ల టర్నోవర్‌ మాత్రమే సాధించింది. ఐటీసీకి.. సిగరెట్ల నుంచి హోటళ్లు, ఎఫ్​ఎంసీజీ(FMCG) వరకు.. వివిధ వ్యాపారాలు ఉన్నాయి. 


మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంతో(రూ. 4,196కోట్లు) పోల్చుకుంటే.. ఐటీసీ నెట్​ ప్రాఫిట్​(ITC Net Profit) 4.6శాతం పెరిగింది. ఏప్రిల్​- జూన్​ త్రైమాసికంలో.. సంస్థ ఆదాయం 39శాతం పెరిగి.. రూ. 19,831.27కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 14,240.76కోట్లుగా ఉండేది. ఇక సిగరెట్​పై వచ్చిన ఆదాయం ఇయర్​ ఆన్​ ఇయర్​లో 29శాతం వృద్ధి చెంది రూ.6,608కోట్లకు చేరింది.
Read more