2023 డిసెంబరు నాటికి సెన్సెక్స్‌ : 68,500

ABN , First Publish Date - 2022-11-29T03:03:13+05:30 IST

భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు వచ్చే ఏడాదిలో మరింత ఎగబాకనున్నాయని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ అంటోంది...

2023 డిసెంబరు నాటికి సెన్సెక్స్‌ : 68,500

మోర్గాన్‌ స్టాన్లీ అంచనా

ముంబై: భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు వచ్చే ఏడాదిలో మరింత ఎగబాకనున్నాయని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ అంటోంది. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 2023లో కనీసం 10 శాతం వృద్ధి నమోదు చేసుకోవచ్చని, డిసెంబరు నాటికి 68,500 స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. వ్యవస్థాగతంగా చూస్తే, జీడీపీలో లాభాల వాటా అప్‌ట్రెండ్‌లో ఉందని.. ముడిసరుకుల వ్యయం తగ్గుదలతో పాటు మూలధన పెరుగుదల, బలమైన డిమాండ్‌ వంటి అంశాలు వచ్చే సంవత్సరంలో కంపెనీ ఆదాయానికి సానుకూలంగా పరిణమించనున్నాయని రిపోర్టులో పేర్కొంది. అయితే, మోర్గాన్‌ స్టాన్లీ.. నిఫ్టీ టార్గెట్‌ను మాత్రం వెల్లడించలేదు. అలాగే, ఉత్తమ పరిస్థితుల్లో సెన్సెక్స్‌ వృద్ధి అంచనాలనూ విడుదల చేయలేదు.

Updated Date - 2022-11-29T03:03:22+05:30 IST