సైయెంట్‌ చేతికి పోర్చుగల్‌ కంపెనీ

ABN , First Publish Date - 2022-06-07T09:30:05+05:30 IST

సైయెంట్‌ చేతికి పోర్చుగల్‌ కంపెనీ

సైయెంట్‌ చేతికి పోర్చుగల్‌ కంపెనీ

డీల్‌ విలువ రూ.340 కోట్లు 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతర్జాతీయం గా వైర్‌లెస్‌ ఇంజనీరింగ్‌ సేవలందిస్తున్న పోర్చుగల్‌ కంపెనీ సెల్ఫీనెట్‌ను సైయెంట్‌ కొనుగోలు చేసింది. 4.1 కోట్ల యూరోలకు (దాదాపు రూ.340 కోట్లు) ఈ కంపెనీని చేజిక్కించుకున్నట్లు సైయెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ బోదనపు తెలిపారు. సెల్ఫీనెట్‌ కొనుగోలుతో కమ్యూనికేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (సీఎ్‌సపీ)కు వైర్‌లెస్‌ ఇంజనీరింగ్‌ సేవల్లో సైయెంట్‌ మరింత పటిష్ఠమైన సేవలను అందించే వీలు కలుగుతుంది. ఖాతాదారు కంపెనీలు 5జీ సామర్థ్యాలను చేకూర్చుకుని డిజిటల్‌ టెక్నాలజీల్లోకి మరింత వేగంగా ప్రవేశించే అవకాశం లభిస్తుంది.

Read more