నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. 5008 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2022-09-20T20:25:21+05:30 IST

నిరుద్యోగులకు ఎస్‌బీఐ(SBI) శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) పోస్టుల

నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. 5008 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఢిల్లీ : నిరుద్యోగులకు ఎస్‌బీఐ(SBI) శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (recruitment drive)నిర్వహించనుంది. ఈ డ్రైవ్ ద్వారా ఎస్‌బీఐ 5008 ఖాళీలను ఈ ఏడాది భర్తీ చేయనుంది. ప్రస్తుతం ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్ (Junior Associate) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- sbi.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 27. ఇక ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, కీలక తేదీలు తదితర వివరాలన్నీ మీకోసం.. 


SBI రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు


దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 07/09/2022


దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ 27/09/2022


అప్లికేషన్ వివరాల ఎడిటింగ్‌కు చివరి తేదీ 27/09/2022


దరఖాస్తును ప్రింట్ చేయడానికి చివరి తేదీ 12/10/2022


ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ.. 07/09/2022 నుంచి 27/09/2022 


వయో పరిమితి..


పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయో పరిమితి.. ఆగస్టు 1, 2022 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.


అర్హతలు..


గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు 30.11.2022 నాటికి లేదా ఈ తేదీ కంటే ముందుగా ఉత్తీర్ణులై ఉండాలి.


గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం/సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా తాత్కాలికంగా ఎంపిక చేయబడితే, వారు 30.11.2022న లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టుగా సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. షరతులకు లోబడి తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఫీజు వివరాలు..


జనరల్, OBC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. అయితే SC/ ST/ PWD/ XS కేటగిరీలు ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించనవసరం లేదు.


ఎంపిక ప్రక్రియ


అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు.. వారి వారి స్థానిక భాషల పరీక్షలతో కూడిన ఆన్‌లైన్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 

Read more