అన్‌క్లెయిమ్డ్ సొమ్ము... రూ. 21,539 కోట్లు... * ఎల్‌ఐసీ దగ్గర చాన్నాళ్ళుగా మూలుగుతున్న పాలసీదారుల డబ్బు

ABN , First Publish Date - 2022-02-16T21:52:54+05:30 IST

ఒకటీ, రెండూ కాదు... ఏకంగా రూ. 21,539 కోట్లు... ఏమిటనుకుంటున్నారా ? జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) దగ్గర మూలుగుతున్న పాలసీదారుల డబ్బు ఇది.

అన్‌క్లెయిమ్డ్ సొమ్ము... రూ. 21,539 కోట్లు...  * ఎల్‌ఐసీ దగ్గర చాన్నాళ్ళుగా మూలుగుతున్న పాలసీదారుల డబ్బు

ముంబై : ఒకటీ, రెండూ కాదు... ఏకంగా రూ. 21,539 కోట్లు... ఏమిటనుకుంటున్నారా ? జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) దగ్గర మూలుగుతున్న పాలసీదారుల డబ్బు ఇది. ఈ వివరాలు నిజంగానే ఆశ్చర్యం కలిగించక మానవు. స్టాక్ ఎక్స్ఛేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు... ఐపీఓ కోసం దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ల్లోని వివరాలివి. ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా దిగ్గజం ఎల్‌ఐసీ... నిరుడు సెప్టెంబరు నాటికి రూ. 21,539 కోట్ల మేర క్లెయిమ్ చేయని సొమ్మును కలిగి ఉండడం విశేషం.


కాగా... పాలైసీదారులు బాకీ ఉన్న మొత్తంపై పొందిన వడ్డీ కూడా ఇందులో ఉంది. ఎల్‌ఐసీ దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం... క్లెయిమ్ చేయని మొత్తం మార్చి 2021 చివరి నాటికి రూ. 18,495 కోట్లు. మార్చి 2020 చివరి నాటికి రూ. 16,052.65 కోట్లు. మార్చి 2019 చివరి నాటికి ఈ మొత్తం రూ. 13,843.70 కోట్లు. బీమా సంస్థలు వెబ్‌సైట్‌లలో రూ. వెయ్యి, లేదా...  అంతకంటే ఎక్కువ మొత్తాల్లో ఉండి, క్లెయిమ్ చేయని డబ్బుకు సంబంధించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్లలో పొందుపరచాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. 


Updated Date - 2022-02-16T21:52:54+05:30 IST