మరో అర శాతం వడ్డింపు!

ABN , First Publish Date - 2022-09-30T06:22:18+05:30 IST

ధరలు దిగి రానంటున్నాయి.. డాలర్‌ ఘాతానికి రూపాయి చిత్తవుతోంది. విదే శీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మున్ముందు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి మళ్లీ మందగించవచ్చన్న భయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తోడు అమెరికా, బ్రిటన్‌ సహా అభివృద్ధి చెందిన దేశాల

మరో అర శాతం వడ్డింపు!

ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన నేడే


ముంబై: ధరలు దిగి రానంటున్నాయి.. డాలర్‌ ఘాతానికి రూపాయి చిత్తవుతోంది. విదే శీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మున్ముందు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి మళ్లీ మందగించవచ్చన్న భయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తోడు అమెరికా, బ్రిటన్‌ సహా అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు కీలక వడ్డీ రేట్లను భారీగా పెంచేస్తున్నాయి. ఇన్ని సవాళ్ల నడుమ ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించనుందా..? అని మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మిగతా సెంట్రల్‌ బ్యాంకుల్లాగే ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో కఠిన వైఖరినే కనబర్చవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.  కాగా ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ఉద యం 10 గంటలకు విడుదల చేయనుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక వడ్డీ రేట్లను మరింత పెంచేందుకే మొగ్గు చూపవచ్చని ఆర్థిక విశ్లేషకులంటున్నారు.


ధరలింకా గరిష్ఠ స్థాయిలోనే ఉన్నందున ఈసారి రెపో రేటును 0.35 శాతం నుంచి 0.50 శాతం వరకు పెంచవచ్చన్న అంచనాలున్నాయి. అంతేకాదు, ఇకపై ఎంపీసీ ధరల నియంత్రణకే అధిక ప్రాధాన్యమిచ్చేలా వడ్డీ రేట్లపై తటస్థ వైఖరిని ప్రదర్శించనుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చేందుకు వడ్డీ రేట్ల విషయంలో గతం లో ప్రదర్శించిన అనుకూల వైఖరిని క్రమంగా ఉపసంహరించుకోనున్నట్లు ఎంపీసీ గత సమీక్షల్లోనే సంకేతాలిచ్చింది. 


వృద్ధి అంచనాలకూ కోత!?:

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవచ్చన్న భయాలతో పాటు మున్ముందు త్రైమాసికాల్లో భారత జీడీపీ మందగించవచ్చన్న అంచనాలున్నాయి. 

Updated Date - 2022-09-30T06:22:18+05:30 IST