నిరోధం 16500

ABN , First Publish Date - 2022-05-30T09:32:09+05:30 IST

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమైనా 16400 వద్ద నిలదొక్కుకోలేక ఒక దశలో 15900 వరకు దిగజారింది.

నిరోధం 16500

సోమవారం  స్థాయిలు

నిరోధం : 16460, 16520

మద్దతు : 16400, 16340


నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమైనా 16400 వద్ద నిలదొక్కుకోలేక ఒక దశలో 15900 వరకు దిగజారింది. కాని తదుపరి బలమైన రికవరీ సాధించి 90 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయి 16350 వద్ద ముగిసింది. కాని గత రెండు వారాల్లో నిలకడగా రికవరీ సాధిస్తూ ఉండడం 15800 వద్ద మద్దతు తీసుకుందనేందుకు నిదర్శనం. మార్కెట్‌ తక్షణ ముప్పు నుంచి బయటపడినా ఇంకా స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ప్రవేశించలేదు. 


ఇప్పటికీ స్వల్పకాలిక నిరోధ స్థాయి 16500ని బ్రేక్‌ చేయలేకపోతోంది. 16500-15800 మధ్యనే చిక్కుకుని సైడ్‌వేస్‌ ధోరణి ప్రదర్శిస్తోంది. కాని ఐదు వారాల బేరిష్‌ ధోరణి అనంతరం కనిష్ఠ స్థాయిల్లో మంచి కన్సాలిడేషన్‌ కనబరిచింది. అంతర్జాతీయ మార్కెట్‌ ధోరణులను బట్టి చూస్తే ఈ వారంలో పాజిటివ్‌గా ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. ప్రధాన స్వల్పకాలిక నిరోధం 16500 వద్ద మరో పరీక్ష ఎదుర్కొనవచ్చు.


బుల్లిష్‌ స్థాయిలు: తదుపరి దిశ తీసుకునే ముందు మార్కెట్‌ 16500 వద్ద (ఈ నెల ఆరో తేదీన నమోదు చేసిన గరిష్ఠ స్థాయి) వద్ద కన్సాలిడేట్‌ కావచ్చు. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్వల్పకాలిక నిరోధం కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 16800, 17100.

బేరిష్‌ స్థాయిలు: 16500 వద్ద విఫలమైతే కరెక్షన్‌ ముప్పు ఉన్నట్టు అప్రమత్త సంకేతం ఇస్తుంది. దిగువన మద్దతు స్థాయి 16200. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే మైనర్‌ బలహీనతలో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు, 16000, 15900. 

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ మార్కెట్‌ ధోరణికి భిన్నంగా అద్భుత రికవరీ సాధించి 1340 పాయిం ట్ల లాభంతో 35600 వద్ద ముగిసింది. స్థూలంగా 3000 పాయింట్ల ర్యాలీని సాధించింది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 36100 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధ స్థాయి 36400.

పాటర్న్‌: నిఫ్టీ 16500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’కు సమీపంలోకి వస్తోంది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ రేఖను బ్రేక్‌ చేయాలి. అలాగే స్వల్పకాలిక చలన సగటు సూచీకి చేరువలోకి వస్తోంది. ప్రధాన మద్దతు స్థాయి 16000. సాధారణ స్థితిలో ఈ స్థాయిని తాకకపోవచ్చు.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

Read more