70% తగ్గిన రామ్‌కీ ఇన్‌ఫ్రా లాభం

ABN , First Publish Date - 2022-08-17T06:26:20+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 70 శాతం తగ్గింది. జూన్‌తో

70% తగ్గిన రామ్‌కీ ఇన్‌ఫ్రా లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 70 శాతం తగ్గింది. జూన్‌తో ముగిసిన మూడు నెలలకు రూ.8.33 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.27.83 కోట్లు ఉంది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం మాత్రం రూ.302 కోట్ల నుంచి రూ.409 కోట్లకు పెరిగింది. 

Read more