ప్రొలిఫిక్స్‌ చేతికి టియర్‌ 2 కన్సల్టింగ్‌ కంపెనీ

ABN , First Publish Date - 2022-07-05T08:17:08+05:30 IST

డిజిటల్‌ టెక్నాలజీస్‌ సేవలందిస్తున్న ప్రొలిఫిక్స్‌.. ఇంగ్లాండ్‌కు చెందిన టియర్‌ 2 కన్సల్టింగ్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది.

ప్రొలిఫిక్స్‌ చేతికి టియర్‌ 2 కన్సల్టింగ్‌ కంపెనీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిజిటల్‌ టెక్నాలజీస్‌ సేవలందిస్తున్న ప్రొలిఫిక్స్‌.. ఇంగ్లాండ్‌కు చెందిన టియర్‌ 2 కన్సల్టింగ్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. టియర్‌ 2 కన్సల్టింగ్‌కు కస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్దిలో మంచి పట్టు ఉంది. బ్రిటన్‌లో చాలా మంది కస్టమర్లు ఉన్నారు. విస్తరణ వ్యూహంలో భాగంగా టియర్‌ 2 కన్సల్టింగ్‌ను కొనుగోలు చేశామని.. దీని వల్ల కస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో కంపెనీకి నైపుణ్యాలు సమకూరుతాయని ప్రొలిఫిక్స్‌ సీఎండీ సత్య బొల్లి తెలిపారు.  

Read more