ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ షురూ

ABN , First Publish Date - 2022-10-08T09:20:53+05:30 IST

ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ షురూ

60.72% వాటా విక్రయించనున్న కేంద్రం, ఎల్‌ఐసీ 

ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణల ఆహ్వానం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిసి బ్యాంక్‌లోని 60.72 శాతం వాటా విక్రయించనున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్‌ (దీపమ్‌) శుక్రవారం ప్రకటన జారీ చేసింది. ఈ డిసెంబరు 16 నాటికి ఇన్వెస్టర్లు బిడ్లు సమర్పించాల్సి ఉంటుం ది. బిడ్లు 180 రోజులపాటు చెల్లుబాటు అవుతాయి. అవసరమైతే ప్రభుత్వం చెల్లుబాటు గడువును మరో 180 రోజులపాటు పొడిగిస్తుంది. బిడ్డింగ్‌లో వాటా దక్కించుకున్న ఇన్వెస్టర్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల కోసం ఓపెన్‌ ఆఫర్‌ కూడా ప్రకటించాల్సి ఉంటుంది. 

 

నియంత్రణ అధికారాలు సైతం బదిలీ 

ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ 49.24 శాతం వాటా కలిగి ఉండగా.. ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం చొప్పున వాటా అమ్మకానికి పెట్టాయి. ఈక్విటీ వాటాతోపాటు బ్యాంక్‌ నియంత్రణాధికారాన్ని సైతం కొత్త ఇన్వెస్టర్‌కు బదిలీ చేయనున్నట్లు దీపమ్‌ వెల్లడించింది. బీఎ్‌సఈ వారాంతం ట్రేడింగ్‌లో ఐడీబీఐ బ్యాంక్‌ షేరు ధర 0.71 శాతం పెరిగి రూ.42.70 వద్ద ముగిసింది. ప్రస్తుత షేరు ధర ప్రకారం 60.72 శాతం వాటా విలువ రూ.27,800 కోట్ల పైమాటే.  


బిడ్డింగ్‌కు కావాల్సిన అర్హతలు 

బిడ్డర్లు కనీసం రూ.22,500 కోట్ల నెట్‌వర్త్‌ కలిగి ఉండాలి. 

గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లుగా లాభాలు ప్రకటించి ఉండాలి. 

కన్సార్షియంలోని సభ్యుల సంఖ్య నాలుగుకు మించరాదు. 

కన్సార్షియానికి నేతృత్వం వహించే సభ్యుడు ఆ కన్సార్షియంలో కనీసం 40 శాతం ఈక్విటీ కలిగి ఉండాలి. 

వాటా కొనుగోలుదారు 15 ఏళ్లలో బ్యాంక్‌లోని ఈక్విటీని 26 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. 

కొనుగోలు చేసే వాటాలో 40 శాతం ఐదేళ్లపాటు లాక్‌-ఇన్‌-పీరియడ్‌లో ఉంటుంది. 


బిడ్డింగ్‌లో ఎవరు పాల్గొనవచ్చు..? 

లిస్టెడ్‌ ప్రైవేట్‌ బ్యాంక్‌లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎ్‌ఫసీ), సెబీ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌), ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఫండ్లు, విదేశీ ఫండ్లు, ఇన్వె్‌స్టమెంట్‌ వెహికిల్స్‌.

Updated Date - 2022-10-08T09:20:53+05:30 IST