ఉద్యోగాల కల్పన, వృద్ధికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-09-08T06:52:16+05:30 IST

ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి నుంచి దిగివచ్చిన నేపథ్యంలో ధరల నియంత్రణ ఇకపై అంత ముఖ్యం కాదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

ఉద్యోగాల కల్పన, వృద్ధికే ప్రాధాన్యం

ద్రవ్యోల్బణుం ఇకపై అంత ముఖ్యం కాదు..


న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి నుంచి దిగివచ్చిన నేపథ్యంలో ధరల నియంత్రణ ఇకపై అంత ముఖ్యం కాదని  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రస్తుతం ప్రభు త్వ ప్రాధాన్యం ఉద్యోగాల కల్పనతోపాటు వృద్ధికి ఊతమివ్వడమేనని ఆమె పేర్కొన్నారు. అలాగే, దేశ సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచడం పైనా ప్రభుత్వం దృష్టిసారించిందని ఇండియా ఐడియాస్‌ సదస్సులో మంత్రి అన్నా రు. ఈ ఏడాది జనవరిలోనే 6 శాతం ఎగువకు చేరిన రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ.. ఏప్రిల్‌లో రికార్డు గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి ఎగబాకింది. మళ్లీ తగ్గుతూ వచ్చి జూలైలో 6.71 శాతానికి పరిమితమైంది. అయితే, ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన నియంత్రణ లక్ష్యం 2-6 శాతానికి ఎగువనే ఉంది. 

Updated Date - 2022-09-08T06:52:16+05:30 IST