బ్రాండెడ్‌ ఫార్మాకూ పీఎల్‌ఐ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-26T08:37:03+05:30 IST

దేశీయంగా బ్రాండెడ్‌ ఔషధాలు తయారు చేసే ఫార్మా కంపెనీలకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని విస్తరించాలనే వాదన వినిపిస్తోంది.

బ్రాండెడ్‌ ఫార్మాకూ పీఎల్‌ఐ ఇవ్వాలి

భారత్‌ బయోటెక్‌ ఈడీ సాయి ప్రసాద్‌

న్యూఢిల్లీ: దేశీయంగా బ్రాండెడ్‌ ఔషధాలు తయారు చేసే ఫార్మా కంపెనీలకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని విస్తరించాలనే వాదన వినిపిస్తోంది. దీనివల్ల ఈ ఔషధాల దిగుమతి భారం తప్పుతుందని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి ప్రసాద్‌ చెప్పారు. దీంతో పాటు బ్రాండెడ్‌ ఔషధ కంపెనీలకు ప్యాకింగ్‌ వస్తువులు, ఇతర సేవలు అందించే కంపెనీలకూ ఈ పథకాన్ని విస్తరించాలని కోరారు. సరైన ప్రోత్సాహకాలు ఉన్నప్పుడే బ్రాండెడ్‌ ఔషద తయారీ కంపెనీలు బలంగా ఉంటాయన్నారు. కొవిడ్‌ సమయంలో కొన్ని ముడి పదార్ధాలు, మన్నికైన వినియోగ వస్తువులకు తీవ్ర కొరత ఎదురైన విషయాన్ని సాయి ప్రసాద్‌ గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం బల్క్‌ డ్రగ్స్‌, మెడికల్‌ డివైజెస్‌, కొన్ని ఫార్మా ఉత్పత్తులకు మాత్రమే పీఎల్‌ఐ పథకం అమలు చేస్తోంది. 


కొత్త ఉత్పత్తులపై ఫోకస్‌: వ్యాక్సిన్ల తయారీ కంపెనీలు.. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ), సరికొత్త ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెట్టాలని భారత్‌ బయోటెక్‌ ఈడీ కోరారు. తయారీ రంగంలో మన కంపెనీలకు గట్టి పట్టు ఉన్నా ఈ రెండు విషయాల్లో  మాత్రం వెనబడ్డాయన్నారు. అయినా కొద్ది కంపెనీలకు మాత్రం ఆర్‌ అండ్‌ డీ, సరికొత్త ఔషధాల తయారీపై మంచి పట్టు ఉందన్నారు. 


మిగతా కంపెనీలు కూడా ఇందుకోసం పెట్టుబడులు పెంచాల ని సూచించారు. ఔషధ పరిశ్రమకు అవసరమైన కొన్ని కీలక ము డి పదార్ధాల దిగుమతికి అనుమతుల విషయంలో కొన్ని నెలల పాటు జాప్యం జరగడంపై సాయి ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశా రు. దీనివల్ల ఔషధ ఉత్పత్తుల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు.

Read more