అద్భుతమైన ఆఫర్లతో వచ్చేసిన OnePlus Nord 2T.. స్పెసిఫికేషన్స్ ఇవే!

ABN , First Publish Date - 2022-07-06T02:35:54+05:30 IST

అంతర్జాతీయ టెక్నాలజీ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి మరో నయా ఫోన్ వచ్చేసింది. ఒన్‌ప్లస్ నోర్డ్

అద్భుతమైన ఆఫర్లతో వచ్చేసిన OnePlus Nord 2T.. స్పెసిఫికేషన్స్ ఇవే!

బెంగళూరు: అంతర్జాతీయ టెక్నాలజీ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి మరో నయా ఫోన్ వచ్చేసింది. ఒన్‌ప్లస్ నోర్డ్ 2టి(OnePlus Nord 2T)ని నేడు (మంగళవారం) భారత్‌లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ నోర్డ్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. వన్ ప్లస్ 10 ప్రొలో తొలిసారి ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్‌నే ఇందులోనూ ఉపయోగించింది. వేగవంతమైన, మృదువైన అనుభూతిని అందించేందుకు వీలుగా ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. మీడియా టెక్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించారు. ఏఐ ఫ్లాగ్ షిప్ కెమెరా ఉపయోగించారు. దీంతోపాటు ఆక్సిజన్ ఓఎస్ 12.1తో పనిచేస్తుంది. 


మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి  వన్ ప్లస్ నోర్డ్ 2టి 5G విక్రయాలు ప్రారంభమయ్యాయి. వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్‌తోపాటు అధీకృత పార్ట్‌నర్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 28,999. ఈ నెల 11 వరకు ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారులు అమెజన్, వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్, వన్ ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్, ప్రధాన ఆఫ్ లైన్ పార్ట్‌నర్ స్టోర్స్‌లో కొనుగోలుపై రూ.1500 తక్షణ రాయితీ లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు ఈ నెలాఖరు వరకు మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది. 


అలాగే, ఈ నెల 14 వరకు పాత వన్‌ప్లస్ ఫోన్లతో ఈ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు రూ. 3వేలు ఆదా కూడా చేసుకోవచ్చు. వన్ ప్లస్ స్టోర్ యాప్‌పై మొదటి 1000 మంది కొనుగోలుదారులకు వన్ ప్లస్ నోర్డ్ హ్యాండీ ఫ్యానీ ప్యాక్ లభిస్తుంది. రెడ్ కేబుల్ క్లబ్ సభ్యుల కోసం మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్ ప్లస్ నోర్డ్ 2టి కొనుగోలుదారులు వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్‌పై ఒక బండిల్ గా కొనుగోలు చేస్తే రెడ్ కేబుల్ కేర్ ప్లాన్‌ను రూ.749లకే పొందవచ్చు. దీన్నే అమెజాన్, ఎంపిక చేసిన వన్ ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్‌లో రూ.999లకు పొందవచ్చు.


12 నెలల ఎక్స్‌టెండెడ్ వారెంటీ, 120 జీబీ క్లౌడ్ స్టోరేజ్, డెడికేటెడ్ కస్టమర్ హెల్ప్ లైన్, ఇంకా మరెన్నో ఎక్స్ క్లూజివ్ ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ పరిమితకాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత రెడ్ కేబుల్ సభ్యులు వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్‌పై వన్ ప్లస్ నోర్డ్ 2టి కొనుగోలు చేయడం ద్వారా రెడ్ కాయిన్స్ ఉపయోగించి రూ.1,000 దాకా ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. 


ఇక ఫీచర్ల విషయానికొస్తే..6.43 అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, ముందువైపు 32 ఎంపీ కెమెరా, వెనకవైపు 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా, 8జీబీ/12జీబీ ర్యామ్, 128 జీబీ/256జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఆప్షన్స్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటివి ఉన్నాయి.

Read more