హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ జూమ్‌!

ABN , First Publish Date - 2022-10-05T09:17:43+05:30 IST

ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు కాలానికి హైదరాబాద్‌ సహా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలం 49 శాతం

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌  జూమ్‌!

9 నెలల్లో  56 పెరిగిన స్థలం లభ్యత 


న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు కాలానికి హైదరాబాద్‌ సహా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలం 49 శాతం పెరిగి 3.28 కోట్ల చదరపు అడుగులుగా నమోదైంది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఆఫీస్‌ స్పేస్‌కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా చాలా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు తమ వాణిజ్య స్థల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేశాయని నివేదిక పేర్కొంది. గత ఏడాది జనవరి-సెప్టెంబరుతో పోలిస్తే, బెంగళూరు, ముంబై నగరాల్లో  కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలం తగ్గగా.. మిగతా నగరాల్లో మాత్రం పెరిగింది. హైదరాబాద్‌లో వార్షిక ప్రాతిపదికన 56 శాతం పెరిగి కొత్తగా 79 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చింది. 

Read more