కొత్త జీవిత బీమా పాలసీలకు ముందస్తు అనుమతి అవసరం లేదు

ABN , First Publish Date - 2022-06-11T09:18:52+05:30 IST

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) చాలావరకు జీవిత బీమా పథకాలకు ‘యూజ్‌ అండ్‌ ఫైల్‌’ విధానాన్ని వర్తింపజేసింది.

కొత్త జీవిత బీమా పాలసీలకు ముందస్తు అనుమతి అవసరం లేదు

నిబంధనలు సడలించిన ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ: భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) చాలావరకు జీవిత బీమా పథకాలకు ‘యూజ్‌ అండ్‌ ఫైల్‌’ విధానాన్ని వర్తింపజేసింది. అంటే, జీవిత బీమా సంస్థలు ఇకపై ఐఆర్‌డీఏఐ ముందస్తు ఆమోదం లేకుండానే ఈ పాలసీలను (వ్యక్తిగత సేవింగ్స్‌, వ్యక్తిగత పెన్షన్‌, యాన్యుటీ ప్లాన్లు మినహా) మార్కెట్లోకి ప్రవేశ పెట్టవచ్చు.


అంతేకాదు, మార్కెట్‌ అవసరాల కు అనుగుణంగా పథకాల డిజైనింగ్‌తో పాటు ప్రీమియం ధర నిర్ణయంలోనూ కంపెనీలకు వెసులుబాటు లభించనుంది. కొద్దిరోజుల క్రితం ఆరో గ్య, సాధారణ బీమా పథకాలకూ ఐఆర్‌డీఏఐ ఇదే తరహా సడలింపునిచ్చింది. తద్వారా బీమా కంపెనీల వ్యాపార నిర్వహణ మరింత సులభం కానుండటంతో పాటు వినియోగదారులకు పాలసీల ఎంపిక పరిధి విస్తృ తం కావడానికి ఇది దోహదపడనుందని నియంత్రణ మండలి పేర్కొంది.

Updated Date - 2022-06-11T09:18:52+05:30 IST