ట్విట్టర్‌ కొనుగోలుకే మస్క్‌ మొగ్గు

ABN , First Publish Date - 2022-10-05T09:26:33+05:30 IST

ట్విట్టర్‌ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్‌ షేరును

ట్విట్టర్‌ కొనుగోలుకే మస్క్‌ మొగ్గు

న్యూయార్క్‌: ట్విట్టర్‌ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్‌ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఈ వార్తలతో మంగళవారం ట్విట్టర్‌ షేర్లు ఒక్కసారిగా 13 శాతం పెరిగి 47.95 డాలర్లకు చేరాయి. దాంతో ఈ కౌంటర్‌లో ట్రేడింగ్‌ నిలిపి వేశారు. నకిలీ ఖాతాల విషయం కోర్టులో నిరూపించడం కష్టమని తేలడంతో మస్క్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. 

Read more