KDM Make In India: మేక్ ఫర్ ద వరల్డ్ లక్ష్యంగా ముందుకెళ్తున్న మేడిన్ ఇండియా లైఫ్‌స్టైల్ బ్రాండ్ కేడీఎం

ABN , First Publish Date - 2022-12-08T17:16:52+05:30 IST

సుప్రసిద్ధ కన్జ్యుమర్ లైఫ్‌స్టైల్, ప్రీమియం మొబైల్ యాక్సెసరీ బ్రాండ్ కేడీఎం (KDM) ఇప్పుడు మేకిన్ ఇండియా

KDM Make In India: మేక్ ఫర్ ద వరల్డ్ లక్ష్యంగా ముందుకెళ్తున్న మేడిన్ ఇండియా లైఫ్‌స్టైల్ బ్రాండ్ కేడీఎం
KDM

ముంబై: సుప్రసిద్ధ కన్జ్యుమర్ లైఫ్‌స్టైల్, ప్రీమియం మొబైల్ యాక్సెసరీ బ్రాండ్ కేడీఎం (KDM) ఇప్పుడు మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ ఆలోచనతో ముందుకెళ్తోంది. ఈ మేరకు పక్కా ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నైలలో స్థానిక, కాంట్రాక్ట్ తయారీదారుల సహకారాన్ని కోరుతున్న కేడీఎం.. అంతర్జాతీయ మార్కెట్లకు విస్తారించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తయారీదారులతో కలిసి పనిచేయడం ద్వారా కేడీఎం ఇప్పుడు మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.

2025 నాటికి లక్ష మంది డీలర్లతో ప్రతి ఇంటిలోనూ కేడీఎం ఉత్పత్తులు ఉండాలన్న లక్ష్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కేడీఎం ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధి ముంబైలో జరుగుతుండగా, ఢిల్లీ, నోయిడా, గుజరాత్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి చేస్తోంది. నాణ్యత విషయంలో రాజీపడని కేడీఎం ఉత్పత్తులు వినియోగదారుల మనసులు దోచుకుంటున్నాయి.

ఈ సందర్భంగా కేడీఎం ఫౌండర్ ఎన్‌డీ మాలి మాట్లాడుతూ.. ప్రతి భారతీయుని మదిలో ‘మేకిన్ ఇండియా’ ప్రతిధ్వనిస్తోందన్నారు. దేశీయ వినియోగదారుల్లో ఇప్పుడు ‘వోకల్ ఫర్ లోకల్’ సెంటిమెంట్ బలంగా ఉన్నట్టు చెప్పారు. గత కొన్నేళ్లుగా ఇండియా మొబైల్ యాక్సెసరీస్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. కేడీఎం సహ వ్యవస్థాపకుడు భవార్‌లాల్ సుతార్ మాట్లాడుతూ.. దేశం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ మనమంతా ‘మేక్ ఫర్ వరల్డ్’ మంత్రంతో పనిచేయాల్సి ఉందని అన్నారు.

Updated Date - 2022-12-08T17:16:53+05:30 IST