మారుతి 10 లక్షల సీఎన్‌జీ కార్ల మైలురాయి

ABN , First Publish Date - 2022-03-16T08:24:05+05:30 IST

మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ).. 10 లక్షల సీఎన్‌జీ కార్ల మైలురాయిని అధిగమించింది. ,,

మారుతి 10 లక్షల సీఎన్‌జీ కార్ల మైలురాయి

న్యూఢిల్లీ : మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ).. 10 లక్షల సీఎన్‌జీ కార్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం మారుతి పోర్టుఫోలియోలో తొమ్మిది సీఎన్‌జీ మోడళ్లు- ఆల్టో, ఎస్‌-ప్రెసో, వ్యాగన్‌ఆర్‌, సెలేరియో, డిజైర్‌, ఎర్టిగా, ఈకో, సూపర్‌ క్యారీ, టూర్‌-ఎస్‌ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 3,700 సీఎన్‌జీ స్టేషన్లున్నాయని, ఇంధనం సర్వత్రా అందుబాటులో ఉందని కంపెనీ సీఈఓ కెనిచి అయుకవా అన్నారు. రాబోయే కాలంలో సీఎన్‌జీ స్టేషన్ల సంఖ్య 10 వేలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందు వల్ల ఎలాంటి కొరత ఉండబోదని కూడా ఆయన చెప్పారు. 2010 నుంచి తాము భద్రత, పనితీరుకి సంబంధించి సీఎన్‌జీ కార్లలోని లోపాలన్నింటినీ సరిదిద్దామని అయుకవా తెలిపారు.

Updated Date - 2022-03-16T08:24:05+05:30 IST