మార్కెట్‌ క్యాప్‌ ఆల్‌టైమ్‌ హై

ABN , First Publish Date - 2022-09-08T07:03:03+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నీరసించింది. 168.08 పాయింట్ల నష్టంతో 59022.89 వద్ద సెన్సెక్స్‌, 31.20 పాయింట్ల నష్టంతో 17624.40 వద్ద నిఫ్టీ ముగిశాయి.

మార్కెట్‌ క్యాప్‌ ఆల్‌టైమ్‌ హై

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నీరసించింది. 168.08 పాయింట్ల నష్టంతో 59022.89 వద్ద   సెన్సెక్స్‌, 31.20 పాయింట్ల నష్టంతో 17624.40 వద్ద నిఫ్టీ ముగిశాయి. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ మాత్రం దూసుకు పోయింది. బుధవారానికి రూ.281 లక్షల కోట్ల కొత్త రికార్డు స్థాయికి చేరింది. ఈ ఏడాది జూన్‌ 20 నుంచి చూస్తే ఇది రూ.46 లక్షల కోట్లు ఎక్కువ. ఇందులో రూ.10 లక్షల కోట్లు గత నెల రోజుల్లోనే జత అయింది. కాగా వడ్డీరేట్ల పెంపు భయం వెన్నాడడం బుధవారం నాటి మార్కెట్‌ క్షీణతకు కారణం.  డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం, ఆర్థిక మాంద్యం భయాలు, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి

Updated Date - 2022-09-08T07:03:03+05:30 IST