హైదరాబాద్‌లో మాన్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం

ABN , First Publish Date - 2022-11-23T02:33:51+05:30 IST

ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాగ్రాన్స్‌, ఫ్లేవర్లను తయారు చేస్తున్న మాన్‌ కంపెనీ హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని...

హైదరాబాద్‌లో మాన్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాగ్రాన్స్‌, ఫ్లేవర్లను తయారు చేస్తున్న మాన్‌ కంపెనీ హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు రూ.25 కోట్లతో దీన్ని ప్రారంభించినట్లు మాన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమిత్‌దా్‌స గుప్తా తెలిపారు. ఆహార, బేవరేజెస్‌, కన్ఫెక్షనరీ, డెయిరీ తదితర రంగాలకు అవసరమైన ఫ్లేవర్లను ఇక్కడ అభివృద్ధి చేస్తారు. 13900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు.

Updated Date - 2022-11-23T02:33:51+05:30 IST

Read more