ప్రధాన మద్దతు 17025

ABN , First Publish Date - 2022-09-26T08:43:55+05:30 IST

నిఫ్టీ గత వారం 17400 వద్ద మైనర్‌ రికవరీ సాధించినా గరిష్ఠ స్థాయిల్లో విఫలమై కరెక్షన్‌లో పడింది.

ప్రధాన మద్దతు 17025

సోమవారం స్థాయిలు

నిరోధం : 17330, 17400

మద్దతు : 17190, 17150


నిఫ్టీ గత వారం 17400 వద్ద మైనర్‌ రికవరీ సాధించినా గరిష్ఠ స్థాయిల్లో విఫలమై కరెక్షన్‌లో పడింది. చివరికి 200 పాయింట్ల మేరకు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలో ముగిసింది. గత ఏడాది కాలంగా నిఫ్టీ 18000 వద్ద ఐదు గట్టి ప్రయత్నాలు చేసి విఫలమైంది. రెండు వారాలుగా ఏర్పడిన ఈ బలమైన కరెక్షన్‌తో మరింత బలహీనత తప్పదని సంకేతం ఇచ్చింది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. టెక్నికల్‌గా మార్కెట్‌ స్వల్పకాలిక కరెక్షన్‌లో ఉంది. అలాగే గత మూడు నెలలుగా ఏర్పడిన ర్యాలీలో 3000 పాయింట్లకు పైగా లాభపడిన నిఫ్టీ ఆశించిన కరెక్షన్‌ ఇప్పుడు సాధించింది. అమెరికన్‌ మార్కెట్లో బేరిష్‌ ట్రెండ్‌, విదేశీ సంస్థల అమ్మకాల ఒత్తిడి ప్రస్తుత కరెక్షన్‌కు కారణం. గత శుక్రవారం నాడు కూడా అమెరికన్‌ మార్కెట్‌ బలహీనత ప్రభావం వల్ల ఈ వారం మరింత రియాక్షన్‌లో పడి ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 17000 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. 

బుల్లిష్‌ స్థాయిలు: ట్రెండ్‌లో సానుకూలత కోసం రాబోయే కొద్ది రోజులూ 17000 వద్ద కన్సాలిడేట్‌ కావాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 17400, 17550. ఈ 17550 స్వల్పకాలిక అవరోధం అయినందు వల్ల మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఆ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 17800.

బేరిష్‌ స్థాయిలు: ఏ మాత్రం బలహీనత ప్రదర్శించి మద్దతు స్థాయి 17150 కన్నా దిగజారినా మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 17000. తక్షణ డౌన్‌ట్రెండ్‌ నివారించుకోవాలంటే ఇక్కడ తప్పనిసరిగా రికవరీ సాధించాలి. విఫలమైతే స్వల్పకాలిక కరెక్షన్‌ తప్పకపోవచ్చు. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. ప్రధాన మద్దతు స్థాయి 16700.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం చారిత్రక గరిష్ఠ స్థాయి 41800 వరకు వెళ్లి రియాక్షన్‌లో పడింది. చివరికి 1200 పాయింట్ల నష్టంతో మానసిక అవధి 40000 కన్నా దిగువన ముగిసింది. మరింత బలహీనపడితే సానుకూలత కోసం ప్రధాన మద్దతు స్థాయి 39000 వద్ద నిలదొక్కుకోవాలి.

పాటర్న్‌: నిఫ్టీ గత వారం ‘‘ఏటవాలుగా ఎగువకు ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారింది. ఇది అప్రమత్త సంకేతం. సానుకూలత కోసం 17000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్న 50 డిఎంఏ వద్ద కూడా రికవరీ తప్పనిసరి. మార్కెట్‌ ప్రస్తుతం స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితిని సద్దుబాటు చేసుకుంటోంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు. 

Read more