మహీంద్రా ఎక్స్‌యూవీ 300 టర్బో చార్జ్‌

ABN , First Publish Date - 2022-10-08T09:15:08+05:30 IST

సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో ఎక్స్‌యూవీ 300 కారు కొత్త వెర్షన్‌ను మహీంద్రా విడుదల చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 టర్బో చార్జ్‌

ప్రారంభ ధర రూ.10.35 లక్షలు


న్యూఢిల్లీ: సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో ఎక్స్‌యూవీ 300 కారు కొత్త వెర్షన్‌ను మహీంద్రా విడుదల చేసింది. ఎక్స్‌యూవీ 300 టర్బోచార్జ్‌ పేరిట విడుదల చేసిన ఈ కారు 5 సెకండ్లలోనే 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. రూ.15 లక్షల లోపు ధరలో అమిత వేగంతో నడిచే కారు ఇదే. డబ్ల్యూ 6, డబ్ల్యూ 8 వేరియెంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ.10.35 లక్షలు కాగా టాప్‌ వేరియెంట్‌ ధర రూ.12.90 లక్షలు. అయితే ఈ కార్లలో ఆటోమేటిక్‌ వేరియెంట్‌ ఏదీ లేదు. దీనికి అమర్చిన 1.2 లీటర్ల త్రీ సిలిండర్‌ ఎంస్టాలియన్‌ టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజన్‌ 130 పీఎస్‌ పవర్‌ ఔట్‌పుట్‌ అందిస్తుంది. ఆల్‌ బ్లాక్‌ ఇంటీరియర్‌, బ్లాక్‌ లెదర్‌ సీట్లు, క్రోమ్‌ పెడల్స్‌ ఆకర్షణలు. 

Read more