మహీంద్రా లాభం రూ.2,773 కోట్లు

ABN , First Publish Date - 2022-11-12T02:56:47+05:30 IST

మహీంద్రా అండ్‌ మహీంద్రా..సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2773 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ఆర్జించింది.

మహీంద్రా లాభం రూ.2,773 కోట్లు

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా..సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2773 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.1,929 కోట్ల కన్నా ఇది 44ు అధికం. కాగా గ్రూప్‌ ఆదాయం రూ.21,470 కోట్ల నుంచి రూ.29,870 కోట్లకు పెరిగింది. విభాగాల వారీగా ఆటోమొబైల్‌ విభాగం రూ.15,231 కోట్లు, వ్యవసాయ పరికరాల విభాగం రూ.7,506 కోట్లు, ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగం రూ.2,974 కోట్లు, ఆతిథ్య విభాగం రూ.598 కోట్లు, రియల్టీ విభాగం రూ.70 కోట్లు ఆదాయం ఆర్జించాయి.

Updated Date - 2022-11-12T02:56:47+05:30 IST

Read more