‘మాజా’ సరికొత్త క్యాంపెయిన్

ABN , First Publish Date - 2022-07-17T02:04:50+05:30 IST

భారతీయ అభిమాన స్వదేశీ మామిడిపళ్ల పానీయం ‘మాజా’ సరికొత్త ప్రచారానికి తెరతీసింది. ఈ క్యాంపెయిన్‌తో మాజా

‘మాజా’ సరికొత్త క్యాంపెయిన్

న్యూఢిల్లీ: భారతీయ అభిమాన స్వదేశీ మామిడిపళ్ల పానీయం ‘మాజా’ సరికొత్త ప్రచారానికి తెరతీసింది. ఈ క్యాంపెయిన్‌తో మాజా కుటుంబ పానీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రచార వీడియో కోసం తన బ్రాండ్ అంబాసిడర్లు అయిన నటుడు అమితాబ్ బచ్చన్‌, నటి పూజా హెగ్డేను ఒకచోట చేర్చింది.


ఈ సందర్భంగా కోకాకోలా ఇండియా నైరుతి ఆసియా పోషకాహార విభాగం డైరెక్టర్ మార్కెటింగ్ అజయ్ కోనాలే మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రారంభంలో తాము ‘దిల్దారీ’ చుట్టూ మాజీ కొత్త గొడుగు ప్రచారాన్ని ఆవిష్కరించినట్టు చెప్పారు. ఇది మాజాను అత్యుత్తమ మామిడి అనుభవంగా విలక్షణమైన రీతిలో బలోపేతం చేయడంలో సహాయపడిందని అన్నారు. మామిడి పండ్లపై ఉన్న ప్రేమతో కుటుంబాలు, తరాల కలయికను తెలియజేయాలని, ఈ కలయిక క్షణాలను మధురంగా ​​మార్చాలని మాజా కోరుకుంటున్నట్టు చెప్పారు. 


తాజా ప్రచార వీడియోలో అమితాబ్ బచ్చన్, పూజా హెగ్డే తాత, మనవరాలుగా కనిపిస్తారు. ఒక గ్రాలసు మాజాతోనే ఇప్పటి వరకు వెలుగులోకి రాని కుటుంబ విశేషాలను చెప్పుకుని ఆస్వాదిస్తుంటారు. కుటుంబంతో సరదా క్షణాలు, సంభాషణలు ఎలా  ప్రకాశిస్తాయో, ప్రజలు ఒకచోట చేరి వారి కథలను పంచుకున్నప్పుడు, విడదీయరాని బంధాలను ఏర్పరుచుకున్నప్పుడు ఆనందం ఎలా పెరుగుతుందో చూపించడం ఈ ప్రచార చిత్రం లక్ష్యం. 

Read more