LPG 19 Kg Commercial Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధర

ABN , First Publish Date - 2022-08-01T22:28:35+05:30 IST

వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ఇది శుభవార్తే. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో నేడు రూ. 36 తగ్గింది

LPG 19 Kg Commercial Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధర

న్యూఢిల్లీ: వాణిజ్య గ్యాస్(Commercial Cylinder) వినియోగదారులకు ఇది శుభవార్తే. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో నేడు రూ. 36 తగ్గింది. ఫలితంగా దేశ రాజధానిలో సిలిండర్ ధర రూ.1976కు దిగొచ్చింది. కోల్‌కతాలో రూ. 2095.50 ఉండగా, ముంబైలో 1936.50, చెన్నైలో రూ. 2141గా ఉంది. గృహ వినియోగ 14.2 కిలోల వంటగ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.


వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. జులై 6న 19 కేజీల సిలిండర్‌పై రూ. 8.50 తగ్గింది. స్థానిక పన్నులు, వ్యాట్ (VAT) కారణంగా రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర జులైలో రూ.198 తగ్గింది. అంతకుముందు జూన్ 1న రూ.135 తగ్గింది. అయితే, అప్పుడు కూడా 14.2 కేజీల గృహ వినియోగ వంటగ్యాస్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.  

Read more