పదహారు సెషన్లు... రూ. 1.23 లక్షల కోట్లు * ఎల్‌ఐసీ వాటాదారులు కోల్పోయిన మొత్తమిది

ABN , First Publish Date - 2022-06-07T22:32:58+05:30 IST

జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) వాటాదారులు 16 సెషన్లలో రూ. 1.23 లక్షల కోట్లను కోల్పోయారు.

పదహారు సెషన్లు... రూ. 1.23 లక్షల కోట్లు  * ఎల్‌ఐసీ వాటాదారులు కోల్పోయిన మొత్తమిది

ముంబై : జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) వాటాదారులు 16 సెషన్లలో రూ. 1.23 లక్షల కోట్లను కోల్పోయారు. బీఎస్‌ఈలో క్రితం ముగింపు రూ. 777.40 తో పోలిస్తే ఎల్‌ఐసీ షేరు ఇంట్రాడేలో 3.24 శాతం క్షీణించి, రూ. 752.15 కు చేరుకుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,00,242 కోట్ల మార్కెట్ క్యాప్‌ నుండి నేడు(మంగళవారం) రూ. 4,76,556 కోట్లకు పడిపోయింది, స్టాక్ ఆఫ్ ఎల్‌ఐసీ) ఈ రోజు బేరిష్ మార్కెట్ సెంటిమెంట్ మధ్య రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. బీఎస్‌ఈలో క్రితం ముగింపు రూ. 777.40 తో పోలిస్తే ఎల్‌ఐసి షేరు ఇంట్రాడేలో 3.24 శాతం క్షీణించి, రూ. 752.15 కు చేరుకుంది.


ఈ రోజు పతనంతో ఎల్‌ఐసీ వాటాదారులు గత 16 ట్రేడింగ్ సెషన్లలో రూ. 1,23,686 కోట్లు నష్టపోయారు. మార్కెట్ అరంగేట్రం చేసిన రెండు వారాల తర్వాత స్టాక్ దాని లిస్టింగ్ ధర నుండి 15.29 శాతం, లేదా... రూ. 115.05 పడిపోయింది. IPO ఇష్యూ ధరతో పోలిస్తే 8.62 శాతం తగ్గింపుతో మే 17న షేర్ బలహీనమైన లిస్టింగ్‌ను పొందిన విషయం తెలిసిందే. కంపెనీ తన స్టాక్‌ను రూ. 902- రూ. 949 ధరలో అందించింది. ఇది బిఎస్‌ఈలో రూ. 867.20 వద్ద లిస్టైంది. NSEలో, IPO ధర కంటే 8.11 శాతం తక్కువగా, రూ. 872 వద్ద స్టాక్ లిస్టైంది. ఈ రోజు(మంగళవారం) పతనంతో ఎల్‌ఐసీ వాటాదారులు గత 16 ట్రేడింగ్ సెషన్లలో రూ. 1,23,686 కోట్లు నష్టపోయారు. 

Read more