26% పెరిగిన కిమ్స్ లాభం
ABN , First Publish Date - 2022-11-12T02:30:57+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్) రూ.106 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్) రూ.106 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.84 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగింది. త్రైమాసిక కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.417 కోట్ల నుంచి రూ.573 కోట్లకు చేరిందని కిమ్స్ సీఎండీ బీ భాస్కర రావు తెలిపారు. సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలలకు అదనంగా 951 పడకలను చేర్చినట్లు తెలిపారు. కంపెనీకి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం సంతృప్తికరంగా ఉంది. కింగ్స్‌వే హాస్పిటల్‌ను కొనుగోలు చేయడం ద్వారా నాగ్పూర్లోకి అడుగుపెట్టినట్లు భాస్కర రావు అన్నారు.
Read more