మార్కెట్లోకి కియా కారెన్స్‌

ABN , First Publish Date - 2022-02-16T05:56:49+05:30 IST

దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా దేశీయ మార్కెట్లోకి కారెన్స్‌ కారును

మార్కెట్లోకి కియా కారెన్స్‌

ప్రారంభ ధర రూ.8.99 లక్షలు


న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా దేశీయ మార్కెట్లోకి కారెన్స్‌ కారును ప్రవేశపెట్టింది. రిక్రియేషనల్‌ వాహనంగా (ఆర్‌వీ) వ్యవహరిస్తున్న ఈ కారు మోడల్‌ను బట్టి పెట్రోల్‌ వేరియెంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధర రూ.8.99 లక్షలు కాగా. డీజిల్‌ వేరియెంట్‌ ప్రారంభ ధర రూ.10.99 లక్షలు. రెండు వేరియెంట్లలోనూ గరిష్ఠ ధర రూ.16.99 లక్షలు. ఇందులో ఆరు లేదా ఏడు సీట్ల ఆప్షన్‌ ఉంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌, 1.4 లీటర్‌ పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌  ఇంజన్లతో 6 ఎంటీ, 7 డీసీటీ, 6 ఏటీ ట్రాన్స్‌మిషన్లలో కారెన్స్‌ అందుబాటులో ఉంటుంది. 

Read more