కీలక మద్దతు 17430

ABN , First Publish Date - 2022-09-19T06:39:24+05:30 IST

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ట్రెండ్‌ కొనసాగిస్తూ ప్రారంభమై మానసిక అవధి 18000 దాటినా నిలదొక్కుకోవడంలో విఫలమై బలమైన కరెక్షన్‌లో పడింది.

కీలక మద్దతు 17430

సోమవారం స్థాయిలు

నిరోధం : 17610, 17660

మద్దతు : 17480, 17400


నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ట్రెండ్‌ కొనసాగిస్తూ ప్రారంభమై మానసిక అవధి 18000 దాటినా నిలదొక్కుకోవడంలో విఫలమై బలమైన కరెక్షన్‌లో పడింది. చివరి రెండు రోజుల్లోనూ 600 పాయింట్లకు పైగా దిగజారి వారం కనిష్ఠ స్థాయిల్లో క్లోజ్‌ కావడం మరింత అప్రమత్తతను సూచిస్తోంది. కీలక నిరోధం 18000 వద్ద బలమైన కరెక్షన్‌ సాధించడంతో అప్‌ట్రెండ్‌కు స్వల్ప విరామం ఇచ్చినట్టు కనిపిస్తోంది. 12 వారాల ర్యాలీ అనంతరం నిఫ్టీ వారం ప్రాతిపదికన బలమైన ర్యాలీ సాధించింది. గత ఏడాది కాలంగా ఈ కీలక స్థాయిని దాటేందుకు కనీసం ఐదు ప్రయత్నాలు చేసి విఫలమైంది. కాని ప్రధాన మద్దతు స్థాయిల్లో రికవరీ కూడా సాధిస్తోంది. గత వారంలో కూడా కనిష్ఠ స్థాయిలకు చేరువలో ముగిసినా ఇంకా స్వల్పకాలిక మద్దతు స్థాయిల కన్నా పైనే ఉంది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌ ఇంకా పాజిటివ్‌గానే ఉంది. ప్రస్తుతం కీలక మద్దతు స్థాయిల కన్నా పైన ఉన్నందు వల్ల సానుకూలత కోసం ఇక్కడ రికవరీ సాధించి తీరాలి. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం 17660 కన్నా పైన నిలదొక్కుకోవాలి. సమీపంలోని ప్రధాన నిరోధం 17800. మరింత పురోగమించాలంటే ఈ నిరోధం కన్నా పైన నిలదొక్కుకోవాలి. స్వల్పకాలిక నిరోధం 18100.

బేరిష్‌ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా సానుకూలత కోసం మద్దతు స్థాయి 17400 వద్ద రికవరీ సాధించి  కన్సాలిడేట్‌ కావడం తప్పనిసరి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. స్వల్పకాలిక మద్దతు స్థాయిలు 17150, 17000. 

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారంలో ఈ సూచీ మరింత ర్యాలీ సాధించి చారిత్రక గరిష్ఠ స్థాయి 41800 వరకు వెళ్లింది. కాని కరెక్షన్‌లో పడి చివరికి 360 పాయింట్ల నష్టంతో అనిశ్చితంగా ముగిసింది. గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్‌ తప్పనిసరి అనేందుకు ఇది సంకేతం. ఇప్పుడు పాజిటివ్‌ ట్రెండ్‌లో పడితే నిరోధ స్థాయి 41300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతు స్థాయి 40000. 

పాటర్న్‌: సానుకూలత కోసం మార్కెట్‌ 17400 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవాలి. గత వారం మార్కెట్‌ స్వల్పకాలిక చలన సగటు స్థాయిల కన్నా దిగజారింది. ఇప్పుడు 50 డిఎంఏకు చేరువవుతోంది. వీక్లీ బార్‌ చార్టుల్లో దిగువకు రివర్సల్‌ పాటర్న్‌ ఏర్పడడం అప్రమత్త సంకేతం.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు.

Updated Date - 2022-09-19T06:39:24+05:30 IST