నేటి నుంచి 4 నగరాల్లో జియో 5జీ సేవలు

ABN , First Publish Date - 2022-10-05T09:34:52+05:30 IST

రిలయన్స్‌ జియో బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా 5జీ టెలికం సేవలు ప్రారంభిస్తోంది. ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఈ సేవలు

నేటి నుంచి 4 నగరాల్లో జియో 5జీ సేవలు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా 5జీ టెలికం సేవలు ప్రారంభిస్తోంది. ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇందుకోసం కంపెనీ ఈ నగరాల్లో ఎంపిక చేసిన ఖాతాదారులకు ‘జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్‌’ పేరుతో ఆహ్వానం మెసేజి పంపుతుంది. ఆ ఖాతాదారులు ఒక జీబీ స్పీడుతో అపరిమిత 5జీ డేటా పొందవచ్చు. ఢిల్లీలో జరిగిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో రిలయన్స్‌ జియో తన 5జీ టెక్నాలజీనీ విజయవంతంగా ప్రదర్శించింది. ఖాతాదారులు తమ సిమ్‌కార్డుగానీ, 5జీ ఫోన్‌గానీ మార్చకుండానే జియో 5జీ సేవలు అందుకోవచ్చు. ఈ ప్రయోగాత్మక ఆఫర్‌ కింద టారిఫ్‌ల్లోనూ ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుత 4జీ టారిఫ్‌లతోనే  5జీ సేవలు అందించబోతున్నట్టు తెలిపింది. 

Read more