ఇక్సిగోతో ఏపీఎస్‌ఆర్‌టీసీ ఒప్పందం

ABN , First Publish Date - 2022-03-18T06:02:41+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎ్‌సఆర్‌టీసీ)కి సమగ్ర టికెటింగ్‌, ట్రాకింగ్‌ వ్యవస్థ సేవలను ఇక్సిగో-అభిబస్‌ అందించనుంది....

ఇక్సిగోతో ఏపీఎస్‌ఆర్‌టీసీ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎ్‌సఆర్‌టీసీ)కి సమగ్ర టికెటింగ్‌, ట్రాకింగ్‌ వ్యవస్థ సేవలను ఇక్సిగో-అభిబస్‌ అందించనుంది. ఇందుకు మాస్టర్‌ సర్వీస్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అభిబస్‌ సీఈఓ సుధాకర్‌ రెడ్డి చిర్రా తెలిపారు. ఇటీవల అభిబ్‌సను ఇక్సిగో కొనుగోలు చేసింది. యునిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (యూటీఎస్‌) వల్ల ప్రయాణికులు ఈ-వాలెట్లు, డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, యూపీఐ, డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌లు తదితర పేమెంట్‌ ఐచ్ఛికాల ద్వారా చెల్లింపులు చేయడానికి వెసులుబాటు లభిస్తుంది. దీంతో పాటు రిజర్వేషన్‌, ట్రాకింగ్‌ సదుపాయాలు, ఫిర్యాదులు చేసే వీలు కూడా ప్రయాణికులకు లభిస్తాయి. 

Read more