ఐపీఓ మార్కెట్‌ వెలవెల

ABN , First Publish Date - 2022-08-08T06:38:39+05:30 IST

ఈ ఏడాది జూన్‌ నుంచి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీ ఓ) మార్కెట్‌ పూర్తిగా నిస్తేజంలోకి జారుకుంది. గత రెం డు నెలల్లో ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఐపీఓకు రాలే దు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌-

ఐపీఓ మార్కెట్‌ వెలవెల

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌ నుంచి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీ ఓ) మార్కెట్‌ పూర్తిగా నిస్తేజంలోకి జారుకుంది. గత రెం డు నెలల్లో ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఐపీఓకు రాలే దు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌-జూలై మధ్య ఐపీఓల ద్వా రా రూ.45,000 కోట్ల సమీకరణకు సెబీ 28 కంపెనీలకు గ్రీ న్‌సిగ్నల్‌  ఇచ్చింది. అందులో 11 కంపెనీలు మాత్రమే ఈ ఏడాది ఏప్రిల్‌-మే మధ్య ఐపీఓల ద్వారా రూ.33,254 కోట్లు సమీకరించాయి. ఇందులో రూ.20,557 కోట్లు ఒక్క ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారానే వచ్చాయి. మరో రూ.12,000 కోట్లు సమీకరించేందుకు మిగతా 17 కంపెనీలు ఎదురు చూస్తున్నాయి.

 

ఎందుకంటే: నిజానికి ఈ 17 కంపెనీల్లో అనేక కంపెనీలు ఇప్పటికే తమ ఐపీఓల కోసం రోడ్‌షోలు పూర్తిచేశాయి. ప్రస్తుతం సెకండరీ మార్కెట్‌ ఏ మాత్రం బాగోలేదు. భారీగా దిద్దుబాటుకు లోనైంది. పేటీఎం, జొమాటో వంటి డిజిటల్‌ కంపెనీల ఐపీఓలు  ఇన్వెస్టర్లను నిండా ముంచాయి. ఎల్‌ఐసీ ఐపీఓ కూడా మదుపరుల్ని నిండా ముంచింది. దీంతో ఐపీఓలంటేనే మదుపరులు ఇప్పుడు వద్దు బాబోయ్‌ అంటున్నారు. అయితే ప్రస్తుతం నిస్తేజంగా ఉన్నా.. వచ్చే రెండు నెలల్లో ఐపీఓ మార్కెట్‌ మళ్లీ కోలుకుంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - 2022-08-08T06:38:39+05:30 IST