ఐఫోన్‌ 14 తయారీ భారత్‌లోనే

ABN , First Publish Date - 2022-09-27T06:56:58+05:30 IST

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌... సరికొత్త ఐఫోన్‌ 14ను భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించింది.

ఐఫోన్‌ 14 తయారీ భారత్‌లోనే

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌... సరికొత్త ఐఫోన్‌ 14ను భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 7న  ఐఫోన్‌ 14ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌పోన్‌ మార్కె ట్‌గా ఉన్న భారత్‌లో ఈ ఫోన్ల తయారీని ప్రారంభించినట్లు యాపిల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. సరికొత్త టెక్నాలజీలు, అత్యంత కీలకమైన రక్షణ సామర్థ్యాలతో తీసుకువచ్చిన ఐఫోన్‌ 14ను చైనా వెలుపల భారత్‌లో ఉత్పత్తి చేయటం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపింది. మరికొద్ది రోజుల్లోనే భారత్‌లో తయారైన ఐఫోన్‌ 14 స్థానికంగా ఉన్న కస్టమర్లకు అందు బాటులోకి వస్తుందని పేర్కొంది. చెన్నై సమీపంలో ఫాక్స్‌కాన్‌కు చెందిన శ్రీపెరంబుదూర్‌ ప్లాంట్‌లో ఈ ఫోన్‌ను యాపిల్‌  తయారు చేయనుంది.

Read more