రష్యన్ క్రూడ్‌... ఐఓసీ కొనుగోలు * భారీ తగ్గింపు వెసులుబాటు

ABN , First Publish Date - 2022-03-17T02:30:53+05:30 IST

రష్యన్ క్రూడ్‌ను భారీ తగ్గింపు ధరతో ఐఓసీ(ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) కొనుగోలు చేసింది. ఐఓసి... రష్యా ప్రస్తుత అంతర్జాతీయ ధరలకు ‘తగ్గింపు’తో ఆఫర్ చేసిన 3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24

రష్యన్ క్రూడ్‌... ఐఓసీ కొనుగోలు  * భారీ తగ్గింపు వెసులుబాటు

న్యూఢిల్లీ : రష్యన్ క్రూడ్‌ను భారీ తగ్గింపు ధరతో ఐఓసీ(ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) కొనుగోలు చేసింది. ఐఓసి... రష్యా ప్రస్తుత అంతర్జాతీయ ధరలకు ‘తగ్గింపు’తో ఆఫర్ చేసిన 3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24 న ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, పుతిన్‌ను ఒంటరి చేయడం కోసం... అంతర్జాతీయంగా తలెత్తిన ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో... ఓ వ్యాపారి ద్వారా కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఐఓసీ యురల్స్ క్రూడ్‌ను మే డెలివరీ కోసం బ్యారెల్‌కు $20-25 తగ్గింపుతో బ్రెంట్‌కు కొనుగోలు చేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలు...  మాస్కోపై ఆంక్షలు విధించడంతో, రష్యా... చమురు, ఇతర వస్తువులను భారత్ సహా ఇతర పెద్ద దిగుమతిదారులకు తగ్గింపు ధరలకు అందించడం ప్రారంభించిన విషయం తెలిసిందే. 


వివాదాస్పద అణు కార్యక్రమానికి సంబంధించి... ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల మాదిరిగా కాకుండా, రష్యాతో చమురు, ఇంధన వాణిజ్యంపై నిషేధం లేదన్న విషయం తెలిసిందే. చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటున్న భారత్... తక్కువ ధరలకు ఎక్కడి నుండైనా కొనుగోళ్ల ద్వారా స్పైలింగ్ ఎనర్జీ బిల్లును తగ్గించుకోవాలని యత్నిస్తోంది. సాంప్రదాయేతర సరఫరాదారు నుండి ఇంధనాన్ని తరలించడానికి అవసరమైన బీమా, సరుకు రవాణా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, తగ్గింపు ధరలకు ముడిచమురును విక్రయించే రష్యా ప్రతిపాదనను దేశం అంచనా వేస్తుందని చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి రెండు రోజుల క్రితం(సోమవారం) రాజ్యసభకు తెలిపారు. 

Read more